అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు: కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-09-08T06:46:35+05:30 IST

అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్‌ కె.మాధవీ లత పేర్కొన్నారు.

అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు: కలెక్టర్‌
ఉండ్రాజవరంలో రైతులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ మాధవీలత

  • ఉండ్రాజవరం, సత్యవాడ గ్రామాల్లో పర్యటన
  • ప్రభుత్వ భవనాల నిర్మాణాలు, నాడు-నేడు పనుల పరిశీలన 

ఉండ్రాజవరం, సెప్టెంబరు 7: అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్‌ కె.మాధవీ లత పేర్కొన్నారు. బుధవారం మండలంలోని ఉండ్రాజవరం, సత్యవాడ గ్రామా ల్లో రైతుభరోసా కేంద్రం, సచివాలయ భవనాల నిర్మాణం, నాడు-నేడు రెండో దశ పనులను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాధవీలత మా ట్లాడుతూ ప్రజలకు మరింత మెరుగైన సేవలందించేందుకు సచివాలయ వ్యవ స్థను ఏర్పాటు చేసి పరిపాలన వికేంద్రీకరణ చేశారన్నారు. గ్రామాల్లో వెల్‌నెస్‌ కేంద్రాలు, సచివాలయాలు, ఆర్బీకేలు  ప్రజలకు అందుబాటులో ఉండే విధం గా నిర్మిస్తున్నట్టు కలెక్టర్‌ చెప్పారు. ఈ మూడు ప్రాధాన్య భవనాలకు పెద్ద ఎత్తున ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. జిల్లాలో 1100 ప్రాధాన్య భవనాల నిర్మాణాలు చేపట్టాల్సి ఉండగా వాటిలో 50శాతం పూర్తయ్యాయని, మరో 150 నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. ప్రభుత్వ లేఅవుట్లలో ఇళ్ల నిర్మా ణాలు 50శాతం ప్రారంభించిన వాటిలో ఉచితంగా విద్యుత్‌ కనెక్షన్లు, మీట ర్లను ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందని కలెక్టర్‌ వెల్లడించారు. నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో ఇప్పటికే స్థలాలు ఇచ్చామన్నారు. ఆర్బీకేలను సందర్శించి అక్కడ అందుతున్న సేవలపై రైతులను అడిగి తెలుసుకున్నారు. 

విద్యలో ఉత్తమ ప్రతిభను కనబర్చాలి

విద్యలో ఉత్తమ ప్రతిభను కనపర్చాలని కలెక్టర్‌ మాధవీలత పేర్కొన్నారు. సత్యవాడ హైస్కూలులో నాడు-నేడు రెండో దశ పనులను ఆమె పరిశీలిం చారు. ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యమిస్తోందని, విద్యార్థులు నైపుణ్యం పెంచుకోవడం ద్వారా ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని సూచించారు. విద్యార్థులతో పాఠ్యాంశాలపై మాట్లాడి వారు కనపర్చిన ప్రతిభను తెలుసుకు న్నారు. బైర్రాజ్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత  కంప్యూటర్‌ శిక్షణ ద్వారా రూపొందించిన ప్రాజెక్టు వివరాలను కలెక్టర్‌ మాధవీలతకు వివరించారు. కార్యక్రమంలో ఎంపీపీ పాలాటి యల్లారీశ్వరి, ఉమ్మడి జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ బూరుగుపల్లి సుబ్బారావు, ఎంపీడీవో ఎ.శ్రీనివాస్‌, తహశీల్దార్‌ కనకరాజు, ఈవోపీఆర్డీ ముత్యం వీరాస్వామినాయుడు, ఇతర అధికారులు, నాయకులు పాల్గొన్నారు.


Updated Date - 2022-09-08T06:46:35+05:30 IST