జీవో 117ను రద్దు చేయాలి

ABN , First Publish Date - 2022-07-05T07:10:56+05:30 IST

ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణకు జీవో 117ను తక్షణం రద్దు చేయాలని, 399 ప్రభుత్వ సిఫార్సు బదిలీలను నిలుపుదల చేయాలని యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు పి.జయకర్‌ డిమాండ్‌ చేశారు.

జీవో 117ను రద్దు చేయాలి

పెరవలి, జూలై 4: ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణకు జీవో 117ను తక్షణం రద్దు చేయాలని, 399 ప్రభుత్వ సిఫార్సు బదిలీలను నిలుపుదల చేయాలని యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు పి.జయకర్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం ఖండవల్లిలో జరిగిన యూటీఎఫ్‌ మండల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నూతన విద్యావిధానం పేరుతో ప్రాథమిక పాఠశాలల్లోని 3,4,5 తరగతుల విలీనాన్ని ఆపాలని డిమాండ్‌ చేశారు. జిల్లా కార్యదర్శి వెంకటరమణ మాట్లాడుతూ ప్రతీ పాఠశాలకు కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు ఉండాలని, తెలుగు, ఆంగ్ల మాధ్యమాలను కొనసాగించాలని, ఉన్నత పాఠశాలలలో 32 పిరియడ్‌లకు మించకుండా చూడాలని, ప్రాథమికోన్నత పాఠశాలలో స్కూల్‌ అసిస్టెంట్‌లను కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా యూటీఎఫ్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. సీతారామరాజు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేశారు. కార్యక్రమంలో మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తారా కృష్ణ, సత్యనారాయణ, గౌరవాధ్యక్షుడు శేఖరరాజు, ట్రెజరర్‌ మహేశ్వరరావు, శిరిగి రాముడు, సింహాచలం పాల్గొన్నారు.

Read more