ప్రభుత్వ తీరుపై ఖండన

ABN , First Publish Date - 2022-08-31T06:55:43+05:30 IST

సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం పిలుపునకు సంబంధంలేని వీఆర్వోలను అరెస్టు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామని వీఆర్వో సంఘం జిల్లా అధ్యక్షుడు మద్దాల బాపూ జీ ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రభుత్వ తీరుపై ఖండన

వీఆర్వోల జిల్లా అధ్యక్షుడు మద్దాల బాపూజీ

రామచంద్రపురం, ఆగస్టు 30 : సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం పిలుపునకు సంబంధంలేని వీఆర్వోలను అరెస్టు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామని వీఆర్వో సంఘం జిల్లా అధ్యక్షుడు మద్దాల బాపూ జీ ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం రాత్రి నుంచి మంగళవారం వరకు వీఆర్వోలను వివిధ రకాలుగా అరెస్టు చేయడం అన్యా యమన్నారు. దున్నపోతు ఈనింది - దూడను కట్టేయమనే సామె తలా వీఆర్వోలను బలిచేయడం ప్రభుత్వానికి తగదని హితవు పలికారు. వీఆర్వోలను అరెస్టు చేయడమే కాకుండా లక్ష రూపా యల పూచీకత్తు బాండ్‌, ఆరు నెలల సస్పెండ్‌, జైలుశిక్ష అంటూ బాండ్‌లు రాయించుకుని కూడా బైండోవర్‌ చేసి పోలీస్‌స్టేషన్‌లో నిర్బంధించడం అన్యాయమన్నారు. ఈ ప్రభుత్వం రెవెన్యూ ఉద్యోగు లకు నిర్ణీత పని గంటల విధానానికి స్వస్తి పలికి, ఒక్కో దశలో 24 గంటలూ వెట్టిచాకిరీ చేయించుకుంటోందన్నారు. ఈకేవైసీ, జగనన్న గృహాలు, ఫీల్డ్‌ అజమాయిషీ, రీసర్వే, రెవెన్యూ వసూళ్లు, ఓటర్‌ అనుసంధానం, వీడియో, టెలీ కాన్ఫరెన్స్‌లో టార్గెట్‌లు ఇచ్చి నెల రోజుల్లో పూర్తి కావాల్సిన పనిని వారంలోనే పూర్తిచేయాలని వీఆర్వోలను మానసిక ఒత్తిడిలకు గురిచేయడం వల్ల జిల్లాలో పలువురు గుండెపోటు వచ్చి మరణిస్తున్నారని, అవకాశం ఉంటే 90 శాతం వీఆర్‌ఎస్‌ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు.



Updated Date - 2022-08-31T06:55:43+05:30 IST