గోదావరి డెల్టాలకు 4950 క్యూసెక్కుల నీరు

ABN , First Publish Date - 2022-06-11T06:20:29+05:30 IST

జిల్లా వ్యాప్తంగా గోదావరి డెల్టాలకు జల వన రుల శాఖాధికారులు శుక్రవారం నీటి విడుదల పెంచి విడుదల చేశారు.

గోదావరి డెల్టాలకు 4950 క్యూసెక్కుల నీరు

నిడదవోలు, జూన్‌ 10 : జిల్లా వ్యాప్తంగా గోదావరి డెల్టాలకు జల వన రుల శాఖాధికారులు శుక్రవారం నీటి విడుదల పెంచి విడుదల చేశారు. తూర్పు డెల్టాకు 2000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా సెంట్రల్‌ డెల్టాకు 450 క్యూసెక్కులు, పశ్చిమ డెల్టాకు 2500 క్యూసెక్కులు నీటిని మొత్తం గోదావరి డెల్టాలకు 4950 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్టు  అధికారులు తెలిపారు. మరోపక్క ధవళేశ్వరం, విజ్జేశ్వరం ఆరమ్స్‌ నుంచి 2864 క్యూసెక్కుల అదనపు జలాలను సముద్రంలోకి విడిచిపెట్టారు.


Read more