వృద్ధ గౌతమికి పోటెత్తిన వరద

ABN , First Publish Date - 2022-07-18T07:07:24+05:30 IST

ఆదివారం వృద్ధ గౌతమికి వరద మరింతగా పోటెత్తింది. సముద్రం తన్నిపట్టడంతో రాత్రికి నీరుదిగక గోదావరి స్ధిరంగా ఉంటుందని ప్రజలు భయపడుతున్నారు. బూలవారి మొండి వద్ద బలహీనంగా ఉన్న ఏటిగట్టుపైకి నీరు చేరింది.

వృద్ధ గౌతమికి పోటెత్తిన వరద

కాట్రేనికోన: ఆదివారం వృద్ధ గౌతమికి వరద మరింతగా పోటెత్తింది. సముద్రం తన్నిపట్టడంతో రాత్రికి నీరుదిగక గోదావరి స్ధిరంగా ఉంటుందని ప్రజలు భయపడుతున్నారు. బూలవారి మొండి వద్ద బలహీనంగా ఉన్న ఏటిగట్టుపైకి నీరు చేరింది. అధికారులు 24గంటలూ ఇసుక బస్తాలు వేయిస్తూనే ఉన్నారు. పల్లంకుర్రు రేవు, నడవపల్లిపల్లిపాలెంలో  ఆదివారం వరద పెరిగింది. పల్లిపాలెంలో 160, పల్లంకుర్రు రేవులో 62ఇళ్లు నీట మునిగాయి. ఈ రెండు గ్రామాల్లోను ప్రజలు పడవలపైనే తిరుగుతున్నారు. తీరప్రాంత గ్రామాలు మగసానితిప్ప, బలుసుతిప్పల్లోకి నీరు చేరింది. మగసానితిప్ప శివాలయం చుట్టూ నీరు చేరింది. వరద బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని ఎమ్మెల్యే పొన్నాడ వెంకటసతీష్‌కుమార్‌ అన్నారు. పల్లంకుర్రు రేవు వద్ద వరద బాధితులను ఆయన పరామర్శించారు.తహశీల్దార్‌ బి.మృత్యుంజయరావు, ఎంపీడీవో కేసీహెచ్‌ అప్పారావు, సర్పంచ్‌ నాతి అలివేలుసత్యనారాయణ, రాష్ట్ర వైసీపీ వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి నడింపల్లి సూర్యనారాయణరాజు(సూరిబాబు), వడ్డి శ్యామ్‌ప్రసాద్‌, అక్కల శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2022-07-18T07:07:24+05:30 IST