ఒక్క అడుగు..దూరంలోనే..

ABN , First Publish Date - 2022-07-18T07:10:17+05:30 IST

ఒక్క అడుగు దూరంలోనే రాజమహేంద్ర వరానికి ముంపు సమస్య తప్పింది..

ఒక్క అడుగు..దూరంలోనే..
ఓరి దేవుడా : నీట ముంపులో ఇస్కాన్‌ ఆలయం ఆవరణ

కొవ్వూరు, జూలై 17 : ఒక్క అడుగు దూరంలోనే రాజమహేంద్ర వరానికి ముంపు సమస్య తప్పింది.. ఏ మాత్రం భద్రాచలం వద్ద గోదా వరి పెరిగినా రాజమహేంద్రవరం ముంపునకు గురయ్యేది. అయితే శనివారం సాయంత్రానికి భద్రాచలం వద్ద వరద తగ్గుముఖం పట్ట డంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. శనివారం ఉదయం నుంచి రాజమహేంద్రవరంలోని పుష్కరఘాట్‌, సరస్వతీ ఘాట్‌, కోటి లింగాల ఘాట్‌లను వరద ప్రవాహం ముంచెత్తింది. రోడ్లపైకి నీరు చేరింది. ఇస్కాన్‌, శ్రీరంగధామం నీట మునిగాయి. మరొక్క అడుగు పెరిగితే రాజమ హేంద్రవరం జలదగ్భందనంలో చిక్కుకునేది. ఇంతలో భద్రాచలం వద్ద వరద ఉధృతి తగ్గుముఖం పట్టడంతో దిగువన ధవళేశ్వరం బ్యారేజ్‌ ఎగువనా ఎటువంటి ఉపద్రవం లేకుండానే గోదారమ్మ శాంతించింది. దీంతో గోదావరి తీరప్రాంత ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు.  


Read more