ఆర్వోబీ కథేంటో...

ABN , First Publish Date - 2022-04-05T06:46:23+05:30 IST

నిడదవోలు, ఏప్రిల్‌ 4: ఉభయగోదావరి జిల్లాల వాహనదారుల ఒక ప్రధాన సమస్య నిడదవోలు పట్టణంలోని రైల్వే గేటు. రైల్వేగేటు వద్ద గోదావరి జిల్లాల వాహనదారుల ట్రాఫిక్‌ ఇక్కట్లను పరిష్కరించేందుకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల సమక్షంలో ఆర్వోబీ నిర్మాణా నికి హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు 2019 జనవరి 7న చంద్రబాబు నిడదవోలు పట్టణంలో ఆర్వోబీ నిర్మాణానికి సంబంధించి పైలాన్‌ ఆవి ష్కరించి 18 నెలల్లో ఆర్వో

ఆర్వోబీ కథేంటో...
నిడదవోలు రైల్వే గేటు వద్ద నిలిచిపోయిన వాహనదారులు

రైల్వే విభాగానికి సంబంధించిన నిర్మాణం దాదాపు పూర్తి

నేటికీ ప్రారంభంకాని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాల్సిన పనులు 

ఆర్వోబీ పూర్తయితే జిల్లా కేంద్రానికి 

మరింత చేరువకు పలు మండలాలు

నిడదవోలు, ఏప్రిల్‌ 4: ఉభయగోదావరి జిల్లాల వాహనదారుల ఒక ప్రధాన సమస్య నిడదవోలు పట్టణంలోని రైల్వే గేటు. రైల్వేగేటు వద్ద గోదావరి జిల్లాల వాహనదారుల ట్రాఫిక్‌ ఇక్కట్లను పరిష్కరించేందుకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల సమక్షంలో ఆర్వోబీ నిర్మాణా  నికి హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు 2019 జనవరి 7న చంద్రబాబు నిడదవోలు పట్టణంలో ఆర్వోబీ నిర్మాణానికి సంబంధించి పైలాన్‌ ఆవి ష్కరించి 18 నెలల్లో ఆర్వోబీ నిర్మాణం పూర్తికావాలని అధికారులను ఆదేశించారు. ఈ నిర్మాణానికి సంబంధించి అప్పటి ప్రభుత్వం మొత్తం రూ.201 కోట్లు అవసరమని ప్రతిపాదించి జీవో విడుదల చేసింది. దీంట్లో రూ.21 కోట్లు భూసేకరణ తదితర అంశాలకు కేటాయించగా, మిగిలిన రూ.180 కోట్లలో రాష్ట్ర ప్రభుత్వం రూ.90  కోట్లు, కేంద్ర రైల్వే శాఖ రూ.90 కోట్లు కేటాయించవలసి ఉంది. అయుతే కేంద్ర రైల్వే శాఖ రూ.56 కోట్లు మాత్రమే కేటాయించేందుకు ముందుకు రావడంతో మిగి లిన నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించి గోదావరి జిల్లాల వాహనదారుల సమస్యను పరిష్కరించేందుకు నడుం బిగించింది. దీంతో కేంద్ర రైల్వేశాఖ తాము కేటాయించిన బడ్జెట్‌కు సంబంధించిన నిధులతో రైల్వే విభాగానికి సంబంధించి పనులు వేగవంతం చేశారు. ఈలోగా సార్వత్రిక ఎన్నికలు రావడం, ఎన్నికల అనంతరం రాష్ట్రంలో ప్రభుత్వం మారడం జరిగింది. అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభు త్వం ఈ ఆర్వీబీ నిర్మాణంపై నిర్లక్ష్యం వహించింది. కొత్త పనుల పైనా, కాంట్రాక్ట్‌ పనులపైనా రివర్స్‌ టెండరింగ్‌ ప్రక్రియకు శ్రీకారం చుట్టడంతో, అందులో భాగంగా నిడదవోలు ఆర్వోబీ పను లూ నిలిచిపోయాయి. ఆనాటి నుంచి ఇప్పటివరకు వరకు రాష్ట్ర ప్రభుత్వం బ్రిడ్జి నిర్మాణ పనులకు సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. దీంతో నిర్మాణ పనులు పూర్తిగా మూలనపడ్డాయి. మరోపక్క కేంద్ర ప్రభుత్వ రైల్వేశాఖకు చెందిన బ్రిడ్జి పనులు తుది దశకు చేరుకున్నాయి. ఇక ఈ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ విషయానికొస్తే మూడు సంవత్సరాల అనంతరం 51 మందికి ఈ ఏడాది మార్చి 23న ప్రభుత్వం నేరుగా స్థల సేకరణకు చెందిన సొమ్మును వారి ఖాతాల్లో జమచేసింది. ప్రస్తుతం జిల్లా పునర్విభజనలో భాగంగా నిడదవోలు నియోజక వర్గం పశ్చిమగోదావరి జిల్లా నుంచి తూర్పుగోదావరి జిల్లాలోకి మారింది. ఈ నేపఽథ్యంలో నిడదవోలు నియోజకవర్గంలోని ఉండ్రా జవరం, పెరవలి మండలాల ప్రజలకు జిల్లా కేంద్రమైన రాజమ హేంద్రవరం చేరుకునేందుకు ఆర్వోబీ నిర్మాణం పూర్తయితే మరిం త దగ్గర కానుంది. ఆర్వోబీ నిర్మాణం పూర్తయితే ఏలూరు జిల్లా పశ్చిమగోదావరి జిల్లా ప్రజలు రాజమహేంద్రవరం, కాకినాడ తదితర జిల్లాలకు రాకపోకలు సాగించేందుకు ఉపయోగపడుతుంది. వెంటనే ఈ నిర్మాణం పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.


ఆర్వోబీ నిధుల వివరాలు..

మొత్తం నిర్మాణం వ్యయం అంచనా : రూ.201 కోట్లు

భూసేకరణకు : రూ.21 కోట్లు

రాష్ట్రం వాటా : రూ.124  కోట్లు  రైల్వేశాఖ వాటా : రూ.56 కోట్లు



భూసేకరణ వివరాలు..

సేకరించవలసిన భూమి : 6.14 ఎకరాలు

ప్రభుత్వ భూమి :  5.11 ఎకరాలు

ప్రైవేటు భూమి : 1.03 ఎకరాలు

స్థల యజమానులు :   51 మంది

నిడదవోలులో : 38 మంది

సమిశ్రగూడెంలో : 13 మంది


Updated Date - 2022-04-05T06:46:23+05:30 IST