-
-
Home » Andhra Pradesh » East Godavari » godavari accidenta-NGTS-AndhraPradesh
-
ప్రమాదవశాత్తూ గోదావరిలో పడిన యువకుడు
ABN , First Publish Date - 2022-08-15T06:24:03+05:30 IST
ప్రమాదవశాత్తూ గోదావరిలో పడిన యువ కుడిని కానిస్టేబుల్, స్థానికులు రక్షించారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం లంకలగన్నవరం గ్రామానికి చెందిన నార్ని దుర్గరాజు పాత అక్విడెక్టు గోడపై కూర్చుండగా ప్రమాదవశాత్తూ ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరిలో పడిపోయాడు.

స్థానికుల సహాయంతో యువకుడిని రక్షించిన కానిస్టేబుల్
పి.గన్నవరం, ఆగస్టు 14: ప్రమాదవశాత్తూ గోదావరిలో పడిన యువ కుడిని కానిస్టేబుల్, స్థానికులు రక్షించారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం లంకలగన్నవరం గ్రామానికి చెందిన నార్ని దుర్గరాజు పాత అక్విడెక్టు గోడపై కూర్చుండగా ప్రమాదవశాత్తూ ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరిలో పడిపోయాడు. అతడు మద్యం మత్తులో ఉన్నాడు. ఆ యువకుడు అక్విడెక్టు గోడలకు ఉన్న రావిచెట్టును గట్టిగా పట్టుకున్నాడు. కూతవేటు దూరంలో గస్తీ నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ఎస్.చిన్న గమనించి అక్కడకు చేరుకుని అలాగే ఉండమని ఆ యువకుడికి సూచించాడు. స్థానిక నివాస గృహాల నుంచి తాడు తెప్పించి కానిస్టేబుల్, స్థానికులు తాడు సహాయంతో ఆ యువకుడిని ఒడ్డుకు తీసుకువచ్చారు. ఇన్‌చార్జ్ ఎస్‌ఐ ఎన్.భుజంగరావు అక్కడకు చేరుకుని ఆ యువకుడిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కౌన్సెలింగ్ అనంతరం ఆ యువకుడిని బంధువులకు అప్పగించారు. ఈసందర్భంగా కానిస్టేబుల్ చిన్న, స్థానికులను పలువురు అభినందించారు.