కాపులు రాజ్యాధికారం సాధించాలి

ABN , First Publish Date - 2022-09-19T06:15:47+05:30 IST

వంగవీటి రంగా స్ఫూర్తితో కాపులు రాజ్యాధికారం సాధించాలని రాధా రంగా మిత్రమండలి రాష్ట్ర అధ్య క్షుడు వంగవీటి నరేంద్ర పిలపునిచ్చారు.

కాపులు రాజ్యాధికారం సాధించాలి

రాజమహేంద్రవరం సిటీ, సెప్టెంబరు 18: వంగవీటి రంగా స్ఫూర్తితో కాపులు రాజ్యాధికారం సాధించాలని రాధా రంగా మిత్రమండలి రాష్ట్ర అధ్య క్షుడు వంగవీటి నరేంద్ర పిలపునిచ్చారు. రాజమహేంద్రవరం చల్లా రెసిడెన్సిలో ఆదివారం రంగా మిత్రమండలి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల అధ్యక్షుడు వడ్డి మురళీ అధ్యక్షతన జరిగిన కాపుల ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. దివంగత వంగవీటి రంగా కాపులతోపాటు సమాజంలో అన్ని సామాజిక వర్గాల అభివృద్ధికి పాటుపడ్డారని, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రంగా విగ్రహాలను వాడవాడలా ఏర్పాటు చేయడమే అందుకు నిదర్శనమన్నారు. రానున్న రోజుల్లో రంగా స్మారక చిహ్నంగా కృష్ణ, గుంటూరు జిల్లాల మధ్య 75 అడుగుల రంగా విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. అనంతరం వడ్డి మురళీ మాట్లాడుతూ స్థానిక ట్రైనింగ్‌ కాలేజీ సెంటర్‌లో తన రాజకీయ గురువు జక్కంపూడి రామ్మోహనరావు తనకు అప్పగించిన పనిని 33 ఏళ్లుగా చేస్తున్నానన్నారు. రంగా జయంతి, వర్ధంతులకు పలు సేవాకార్యాక్రమాలు చేస్తున్నామన్నారు. 75అడుగుల రంగా విగ్రహం ఏర్పాటుకు రూ.10,116 అందించారు. అనంతరం వంగవీటి నరేంద్రను ఘనంగా సత్కరించారు. సమావేశంలో సమితి నగర ఉపాధ్యక్షుడు మనే దొరబాబు, గౌరవ కార్యదర్శి పురంశెట్టి ప్రసాద్‌ నాయుడు, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు నాళం వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షుడు వక్కపాటి మురళి, కాపు సంఘం నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-09-19T06:15:47+05:30 IST