తోటల పునరుద్ధరణతో అధిక దిగుబడులు

ABN , First Publish Date - 2022-11-12T00:48:28+05:30 IST

జీడిమామిడి తోటల పునరుద్ధరణతో అధిక దిగుబడి సాధ్యమవుతుందని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్‌ రాజశేఖర్‌ సూచించారు.

తోటల పునరుద్ధరణతో అధిక దిగుబడులు

గంగవరం, నవంబరు 11: జీడిమామిడి తోటల పునరుద్ధరణతో అధిక దిగుబడి సాధ్యమవుతుందని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్‌ రాజశేఖర్‌ సూచించారు. సూరంపాలెంలో సర్పంచ్‌ శివదొర, ఐటీడీఏ ఉద్యానవన అఽధికారి కె.చిట్టిబాబు ఆధ్వర్యంలో రైతులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ముదురు జీడిమామిడి తోటలకు తెగుళ్లు సోకినా బలహీనమైన కొమ్మలు తొలగించడం ద్వారా కొత్తకొమ్మలపై పూతకాపు వస్తుందన్నారు. జీడిమామిడి తోటల్లో లోతు దుక్కుల ద్వారా వర్షపునీరు ఇంకిపోతుందని తద్వారా నీటినిల్వలు పెరిగి చెట్లు బాగా పెరుగుతాయన్నారు. భూసార పరీక్షలు తప్పనిసరిగా చేయించాలన్నారు. కరపెండలం దుంప సాగులో వచ్చే తెగుళ్లు, నివారణ చర్యలు వివరించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ పద్మావతి, ఎంపీఈవోలు స్వర్ణలత, శోభన్‌బాబు, అప్పలస్వామి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-12T00:48:29+05:30 IST