ఆహార భద్రతలో లోపం ఉంటే క్షమించం

ABN , First Publish Date - 2022-12-10T00:50:50+05:30 IST

బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆహార భద్రత కల్పించేందుకు కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల అమలులో అధికారులు అవినీతికి తావులేకుండా పనిచేయాలని రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ విజయ ప్రతాపరెడ్డి పేర్కొన్నారు.

ఆహార భద్రతలో లోపం ఉంటే క్షమించం

రాష్ట్రంలో 150 అంగన్‌వాడీ కేంద్రాల పరిశీలన

రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ విజయ ప్రతాప్‌రెడ్డి

బొమ్మూరు, డిసెంబరు 9: బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆహార భద్రత కల్పించేందుకు కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల అమలులో అధికారులు అవినీతికి తావులేకుండా పనిచేయాలని రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ విజయ ప్రతాపరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం బొమ్మూరు కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఆహార కమిషన్‌ సమన్వయ శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటుచేశారు. జిల్లాలో పలు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన పలు అంశాలపై అధికారులతో మాట్లాడారు. చౌక ధరల దుకాణాలు, మండలస్థాయి స్టాక్‌ పాయింట్‌లు, ఎండీయూ వాహ నాలు, పాఠశాలలు సంక్షేమ వసతిగృహాలు తదితర చోట్ల సందర్శించి నట్టు తెలిపారు. కొన్నిచోట్ల లోపాలు గుర్తించామన్నారు. జగనన్న గోరుముద్ద పథకం అమలు, సంక్షేమ వసతి గృహాలు, అంగన్వాడీల్లో పౌష్టికాహార పంపిణీ, పీఎంఎంవీవై పథకాలపై కమిషన్‌ దృష్టి సారిస్తోందని తెలిపారు. పోర్టిఫైడ్‌ బియ్యంపై అవగాహన కల్పించా లన్నారు. అవకతవకలకు పాల్పడిన అధికారులపై చర్యలకు ఉన్న తాధికారులకు సిఫార్సు చేశామన్నారు. పథకాలు, సమస్యలపై 9490551117 వాట్సాప్‌ నెంబరుకు ఫిర్యాదు చేయవచ్చని, 155235 టోల్‌ఫ్రీ కూడా అందుబాటలో ఉందని తెలిపారు. జాయింట్‌ కలెక్టర్‌ తేజ్‌భరత్‌ మాట్లాడుతూ ఫుడ్‌ కమిషన్‌ సూచనల మేరకు ఆహార పంపిణీ వ్యవస్థలు మరింత పటిష్టంగా పనిచేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. చైర్మన్‌గా ప్రతాప్‌రెడ్డి 523 కేంద్రాలను తనిఖీ చేయడం ఆయన నిబద్ధతకు నిదర్శనమన్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా ప్రభుత్వం పౌష్టికాహారం పథకం అమలు చేస్తోందని చెప్పా రు. కమిషన్‌ సభ్యుడు జె.కృష్ణకిరణ్‌ పలు విషయాలపై మాట్లాడారు. సమావేశంలో డిప్యూటీ డైరెక్టర్‌ పి.సురేష్‌, సివిల్‌ సప్లయ్స్‌ డీఎం తనూజా, డీఎస్‌వో ప్రసాదరావు, ఐసీడీఎస్‌ పీడీ విజయలక్ష్మి తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-10T00:50:51+05:30 IST