పూలసాగుపై రైతులకు అవగాహన

ABN , First Publish Date - 2022-03-16T05:38:44+05:30 IST

మండలంలో వేమగిరి డైరెక్టరేట్‌ ఆఫ్‌ ప్లోరికల్చర్‌ రీసెర్చి, ఉప పరిశోధనా కేంద్రంలో మంగళవారం రైతులకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

పూలసాగుపై రైతులకు అవగాహన

కడియం, మార్చి 15: మండలంలో వేమగిరి డైరెక్టరేట్‌ ఆఫ్‌ ప్లోరికల్చర్‌ రీసెర్చి, ఉప పరిశోధనా కేంద్రంలో మంగళవారం రైతులకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిధిగా వైఎస్సార్‌ విశ్వవిద్యాలయం వైస్‌ చాన్సలర్‌ జానకీరామ్‌, డీఎఫ్‌ఆర్‌ డైరెక్టర్‌ కేవీ ప్రసాద్‌, డీఎఫ్‌ఆర్‌ ప్రధాన శాస్త్రవేత్త డీవీఎస్‌ రాజు, ప్రధాన శాస్త్రవేత్త హెచ్‌ఆర్‌ఎస్‌ అంబాజీపేట ఎన్‌బీవీ చలపతిరావు రైతులకు పలు విషయాలను వివరించారు. జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా పూలపంటలో పురుగులు, తెగుళ్లు యాజమాన్యం, నివారణా చర్యలు, జీవ నియంత్రణతో అధిక దిగుబడి, పూలపంటలో జీవరసాయనాల వాడకంతో కలిగే ప్రయోజనాలను వివరించారు. శాస్త్రవేత్తలు మాధవన్‌, శిరీష రైతులతో చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు.  ఐసీఏఆర్‌-సీటీఆర్‌ఐ ఆర్‌.సత్యవాణి, ఉద్యాన అధికారి మాట్లాడుతూ కేవీకే ద్వారా రైతులకు అందించే శిక్షణా కార్యక్రమాలను వివరించారు.

Read more