వరదలో చిక్కుకున్న యువకులు

ABN , First Publish Date - 2022-09-17T06:01:04+05:30 IST

వరదలో కొట్టుకుపోతూ చెట్టుకొమ్మలను ప ట్టుకున్న ఇద్దరిని స్థానికులు రక్షించారు.

వరదలో చిక్కుకున్న యువకులు

ఇద్దరు వ్యక్తులను రక్షించిన స్థానికులు 

 వరదలో కొట్టుకుపోయిన మోటారు సైకిల్‌ 

మామిడికుదురు, సెప్టెంబరు 16: వరదలో కొట్టుకుపోతూ చెట్టుకొమ్మలను ప ట్టుకున్న ఇద్దరిని స్థానికులు రక్షించారు. పేరాబత్తుల దుర్గాప్రసాద్‌, షేక్‌ మీరా సాహెబ్‌లు శుక్రవారం మోటార్‌సైకిల్‌పై బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం అప్పనపల్లి ఉచ్చులవారిపేట నుంచి మామిడికుదురువైపు వస్తున్నారు. మార్గమధ్య లో పాటురేవు దాటాలి. వరద నేపథ్యంలో రేవు దాటవద్దని స్థానికులు వారించినా వినకుండా వారు రేవు దాటుతుండగా వరద ప్రవాహానికి కొట్టుకుపోయారు. వీరు చెట్ల కొమ్మలను పట్టుకోవడంతో స్థానికులు వారిని ఒడ్డుకు చేర్చారు. స్థానిక యువకులు తాడు  సాయంతో మోటారుసైకిల్‌ను కూడా ఒడ్డుకు చేర్చారు. దీంతో ప్రాణాపాయం తప్పిందని స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. 



Read more