వరద.. వైరల్‌..

ABN , First Publish Date - 2022-08-21T06:59:53+05:30 IST

గోదావరి వరదలతో ప్రజల ఇక్కట్లు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా నదీ పరీవాహక గ్రామాల్లో ఉన్న ప్రజలు వైరల్‌ ఫీవర్లతో ఇబ్బందులకు గురవుతున్నారు

వరద.. వైరల్‌..
పి.గన్నవరం మండలం మానేపల్లి శివారులో వరదనీటిలో మహిళలు తాగునీటి కోసం ఇక్కట్లు

వరదతో కొనసాగుతున్న ప్రజల ఇక్కట్లు

 వైరల్‌ జ్వరాలకు గురవుతున్న లంకలవాసులు

(అమలాపురం-ఆంధ్రజ్యోతి)

గోదావరి వరదలతో ప్రజల ఇక్కట్లు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా నదీ పరీవాహక గ్రామాల్లో ఉన్న ప్రజలు వైరల్‌ ఫీవర్లతో ఇబ్బందులకు గురవుతున్నారు. తాగునీరు కలుషితం కావడంతో జ్వరం, జలుబు, దగ్గు వంటి సమస్యలతో జిల్లాలోని నదీ పరీవాహక గ్రామాల ప్రజలు సతమతమవుతున్నారు. భద్రాచలం దగ్గర వరద తగ్గుముఖం పట్టినప్పటికీ ధవళేశ్వరంలో రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతూనే ఉంది. 12 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలారు. అయితే కోనసీమలోని వశిష్ఠ, వైనతేయ, గౌతమీ, వృద్ధ గౌతమీ నదీపాయల వెంబడి ఉన్న లంక గ్రామాలను చుట్టుముట్టిన వరద స్వల్పంగా మాత్రమే తగ్గుముఖం పట్టింది. శనివారం నాటికి  కూడా కాజ్‌వేలపై వరద ప్రవాహం స్వల్పంగానే తగ్గినప్పటికీ ప్రజ లు మాత్రం పడవలపైనే ప్రయాణాలు చేస్తున్నారు. లంక గ్రామాల్లో వరద దిగ్బంధంలో ఉన్న ప్రజలు తాగునీటి కోసం పడుతున్న ఇక్క ట్లు వర్ణనాతీతంగా ఉన్నాయి. గత 38 రోజులుగా నీటిలోనే నాను తున్న వ్యవసాయ పంటలన్నీ దుర్గంధ భరితంగా మారి వాసన భరించలేకపోతున్నామని ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన చెం దుతున్నారు. అటు అప్పనపల్లి కాజ్‌వేపైన నీటి ప్రవాహం కొనసా గుతోంది. ఉచ్చులవారిపేటలో వరద ముంచెత్తినా అక్కడి ప్రజలు పడుతున్న ఇబ్బందులు దారుణంగా ఉన్నాయి. మొత్తంమీద కోనసీ మలో లంక గ్రామాల ప్రజలు అటు గోదావరి వరదతో పాట్లు పడుతూనే ఇటు వైరల్‌ జ్వరాలతో నానా ఇబ్బందులు పడుతున్నారు. 

డ్రెయిన్‌ గండి పూడ్చివేత

అల్లవరం, ఆగస్టు 20: వైనతేయ గోదావరి వరద నీరు పోటెత్తి బోడసకుర్రు పరిధిలో కుమ్మరికాల్వ డ్రెయిన్‌గట్టుకు పడిన గండిని ఇసుక బస్తాలతో పూడ్చి వేశారు. డ్రెయిన్స్‌ ఏఈ కె.సునీత ఆధ్వర్యంలో డ్రెయిన్‌గట్టు గండిని పూడ్చివేయడంతో ముంపునీరు వెళ్లకుండా నిరోధించారు. సర్పంచ్‌ రొక్కాల విజయ లక్ష్మి, రొక్కాల నాగేశ్వరరావు పాల్గొన్నారు. గండి పూ డ్చివేతతో దిగువకు వరదనీరు వెళ్లకుండా ఆగింది.


 

Read more