-
-
Home » Andhra Pradesh » East Godavari » floods heavy rains suddagdda-NGTS-AndhraPradesh
-
తగ్గని వర్షం
ABN , First Publish Date - 2022-09-11T07:19:08+05:30 IST
ఏకధాటి వర్షాలకు సుద్దగడ్డ(కొండ) కాలువ వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తోంది. గట్లకు సమాంతరంగా ప్రవహిస్తూ పలుచోట్ల పొంగిపొర్లుతుండడంతో గొల్లప్రోలు పట్టణంతోపాటు తాటిపర్తి రోడ్డు తదితర ప్రాంతాల్లో 500 ఎకరాల్లో వరి పంట నీట మునిగింది.

- ఎడతెరిపిలేని వానలకు పొంగి పొర్లుతున్న కాలువలు
- ఉధృతంగానే సుద్దగడ్డ కాలువ
- ప్రత్తిపాడు, గొల్లప్రోలుల్లో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం
జిల్లాలో వర్షం తగ్గలేదు. అలా కురుస్తూనే ఉంది. వాన ధాటికి సుద్దగడ్డ కాలువ పొంగి ప్రవహిస్తోంది. దీని ప్రభావంతో ప్రత్తిపాడు, గొల్లప్రోలు మండలాల్లో ఆయా గ్రామాల్లో రహదారులు జలమయమై రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. చాలాచోట్ల పంటలు కూడా నీటమునిగాయి. ప్రత్తిపాడు-లంపకలోవ ఆర్‌అండ్‌బీ రహదారి నిలిపివేశారు. కాకినాడ, కరప, సామర్లకోట, పెద్దాపురం, జగ్గంపేట, తుని తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.
గొల్లప్రోలు, సెప్టెంబరు 10: ఏకధాటి వర్షాలకు సుద్దగడ్డ(కొండ) కాలువ వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తోంది. గట్లకు సమాంతరంగా ప్రవహిస్తూ పలుచోట్ల పొంగిపొర్లుతుండడంతో గొల్లప్రోలు పట్టణంతోపాటు తాటిపర్తి రోడ్డు తదితర ప్రాంతాల్లో 500 ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. గొల్లప్రోలు-తాటిపర్తి పంచాయతీరాజ్ రహదారిపై ఐదు అడుగుల ఎత్తున వరద నీరు ప్రవహిస్తుండడంతో రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. పట్టణ శివారులోని జగనన్న కాలనీకి వెళ్లే రహదారి పూర్తిగా ముంపునకు గురైంది. రోడ్డును వరద నీటిలో దాటేందుకు తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న తా డు వరద ఉధృతికి కొట్టుకుపోయింది. తాగునీరు, ఇతర సౌకర్యాలు లేక కాలనీవాసులు అవస్థలు పడుతున్నారు. చౌటుకాలువ ఉధృతంగా ప్రవహి స్తోంది. పత్తి, కాయగూరలు, మిర్చి పంటలకు అపారనష్టం వాటిల్లింది.
ప్రత్తిపాడులో స్తంభించిన రవాణా
ప్రత్తిపాడు, సెప్టెంబరు 10: మండలంలో శనివారం వాగులు, చెరువులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఆర్‌అండ్‌బీ రహదారి మీదుగా వాగులు ప్రవ హించడంవల్ల రవాణా స్తంభించిపోయింది. భారీ వర్షాలకు సుద్దగడ్డ వాగు ఉగ్రరూపం దాల్చడంవల్ల ప్రత్తిపాడు, లంపకలోవ ఆర్‌అండ్‌బీ రహదారి బంద్ చేశారు. సుద్దగడ్డ వాగువద్ద బారికేడ్‌లు, బ్యానర్‌లు పోలీసులు ఏర్పా టు చేసి ఈ మార్గంలో వాహనాలు వెళ్లకుండా చర్యలు చేపట్టారు. ఒమ్మం గి, శరభవరం రహ దారిపై మరో గడ్డవాగు రహదారి మీదుగా ప్రవహి స్తుండడంవల్ల స్కార్పియో కారు వాగులో చిక్కుకుపోయింది. ఈ ఆర్‌అండ్ బీ రహదారిపై రాకపో కలు నిలిచిపోయాయి. పెదశంకర్లపూడి గ్రామం వ ద్ద వెంకన్నదొర చెరువు పొంగి ప్రవహించి రహదారి మీదుగా వెళ్తుండ డంతో ఏలేశ్వరం, శాంతి ఆశ్రమంపై రాకపోకలు బంద్ అయ్యాయి. చింత లూరు సమీపంలో రామానుజన్ చెరువువద్ద కూడా వెంకట్‌నగరం, గజ్జెన పూడి రహదారి ముంపునకు గురై వాహన రాకపోకలు నిలిచిపోయాయి. సుద్దగడ్డ, ఒమ్మంగి, శరభవరం, మరో వాగు గడ్డల కారణంగా సమీపం లోని వరి, పత్తి, సరుగుడు తోటలు ముంపునకు గురయ్యాయి.
జిల్లాలో వర్షపాతం వివరాలు
కాకినాడ సిటీ, సెప్టెంబరు 10: జిల్లాలో గడచిన 24 గంటల్లో 34.1 మి.మీ. సరాసరితో మొత్తం 716.4 మి.మీ. వర్షం కురిసింది. అత్యధికంగా పిఠాపురం మండలంలో 70.2 మి.మీ. వర్షపాతం నమోదు కాగా, అత్యల్పంగా రౌతులపూడి మండలంలో 4.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. మండలాలవారీగా వర్షపాతం వివరాలు మి.మీ.లలో.. శంఖవరం 68.0, జగ్గంపేట 57.4, ప్రత్తిపాడు 56.0, యు.కొత్తపల్లి 54.6, గొల్లప్రోలు 50.2, పెద్దాపురం 47.2, ఏలేశ్వరం 46.8, తుని 42.2, గండేపల్లి 34.2, కాకినాడ అర్బన్ 28.4, సామర్లకోట 27.6, కిర్లంపూడి 24.8, తొండంగి 21.0, కాకినాడ రూరల్ 19.2, కరప 17.6, పెదపూడి 16.6, కాజులూరు 14.4, తాళ్లరేవు 11.2, కోటనందూరు 4.6 మి.మీ. వర్షం కురిసింది.