అనపర్తిలో ఫ్లెక్సీ కలకలం..

ABN , First Publish Date - 2022-08-15T06:25:57+05:30 IST

తన ఇంటిని కాజేయాలని చూస్తూ తనపై అక్రమ కేసులు బనాయిం చేందుకు ప్రయత్నిస్తున్న వారి నుంచి కాపాడాలంటూ ఒక వ్యక్తి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ కలకలం రేపింది.

అనపర్తిలో ఫ్లెక్సీ కలకలం..
న్యాయంచేయాలని బాధితుడు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ

అనపర్తి, ఆగస్టు 14 : తన ఇంటిని కాజేయాలని చూస్తూ తనపై అక్రమ కేసులు బనాయిం చేందుకు ప్రయత్నిస్తున్న వారి నుంచి కాపాడాలంటూ ఒక వ్యక్తి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ కలకలం రేపింది.అనపర్తి మహాలక్ష్మి పేటకు చెందిన చిట్టూరి కృష్ణ ఒక వడ్డీ వ్యాపారి వద్ద 2019లో ఇల్లు తాకట్టు పెట్టి నూటికి రూ.2ల వడ్డీ లెక్కన రూ.7.8 లక్షల రుణం తీసుకున్నాడు. ఈ మేరకు ఇంటిని వడ్డీ వ్యాపారి పేరున రిజిస్ర్టేషన్‌ చేసేశాడు.ఇది జరిగిన 15 రోజు ల్లోనే వ్యాపారి వడ్డీ రెండు రూపా యలు కాదు.. ఆరు రూపాయలని చెప్పడంతో కంగుతిన్న కృష్ణ వెంటనే వడ్డీ వ్యాపారికి రూ. 8.5 లక్షలు జమ చేశాడు.అయితే అప్పటికే కరోనా వ్యాప్తి చెందడంతో తిరిగి రిజిస్ట్రేషన్‌ చేయిం చుకోలేదు. ఇటీవల వడ్డీ వ్యాపారి ఇంటి పన్నును తన పేరున మార్పు చేయించుకుని ఇల్లు ఖాళీ చేయాలని గొడవకు దిగాడు. దీంతో కృష్ణ తాను సొమ్ములు చెల్లించానని ఇల్లు మీదెలా అవుతుందని ఎదురు తిరిగాడు. ఈ ఘటనపై సీఎం నుంచి అన్ని డిపార్ట్‌మెంట్ల అధికారులకు లేఖలు రాసిన కృష్ణ లేఖ ప్రతిని ఫ్లెక్సీగా ముద్రించి రోడ్డుపై పెట్టాడు.ఈ విషయం ఆదివారం   అనపర్తిలో చర్చనీయాంశంగా మారింది. ఫ్లెక్సీలో  పోలీసుల ప్రమేయం ఉండ డంతో అనపర్తి పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఫ్లెక్సీని తొలగించారు.  దీనిపై ఎస్‌ఐను వివరణ కోరగా ఆ ఫ్లెక్సీలో పోలీసుల ప్రస్తావన ఉంది కాబట్టే తొలగించామని తెలిపారు. గతంలోనే అతనిపై కేసు నమోదై ఉందన్నారు. 

Read more