ఆవును రక్షించిన అగ్నిమాపక సిబ్బంది

ABN , First Publish Date - 2022-07-18T05:56:57+05:30 IST

కాకినాడ క్రైం, జూలై 17: ఇంటి ఆవరణలోని 10అడుగుల లోతు నేల బావిలో పడి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న నోరులేని మూగజీవాన్ని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. కాకినాడ కొండయ్యపాలెం జ్యోతుల సీతారామమూర్తి ఆస్పత్రి వెనుకాల గల బాబూరావు ఇంటి ప్రాంగణంలో ఉన్న

ఆవును రక్షించిన అగ్నిమాపక సిబ్బంది

కాకినాడ క్రైం, జూలై 17: ఇంటి ఆవరణలోని 10అడుగుల లోతు నేల బావిలో పడి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న నోరులేని మూగజీవాన్ని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. కాకినాడ కొండయ్యపాలెం జ్యోతుల సీతారామమూర్తి ఆస్పత్రి వెనుకాల గల బాబూరావు ఇంటి ప్రాంగణంలో ఉన్న బావిలో ఆదివారం తెల్లవారుజామున ఆవు ప్రమాదవశాత్తూ పడిపోయింది. అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వడంతో లీడింగ్‌ ఫైర్‌మేన్‌ ఎమ్మెస్సీ మౌళిదాస్‌, డ్రైవర్‌ ఆపరేటర్‌ ఎల్‌వీ భాస్కర్‌రావు, వైర్‌మేన్లు పి.శ్రీనివాస్‌, పి.బాబూరావు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బావి నీటితో నిండేలా పంపింగ్‌ చేసి తాడు సాయంతో ఆవును సురక్షితంగా రక్షించారు. ఆవుకు ప్రాణహాని లేకుండా రక్షించిన అగ్నిమాపక సిబ్బంది, ఏడీఎ్‌ఫవో ఏసుబాబుకి స్థానిక కార్పొరేటర్‌ బాలప్రసాద్‌ కృతజ్ఞతలు తెలిపారు.

Read more