రైతుల సంక్షేమానికి అనేక ప్రభుత్వ పథకాలు

ABN , First Publish Date - 2022-08-15T06:36:12+05:30 IST

రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని ఎమ్మెల్యే తలారి వెంకట్రావు అన్నారు. దేవరపల్లిలో సొసై టీ ఎరువుల గొడౌన్‌ నిర్మాణానికి ఆదివారం ఆయన భూమిపూజ చేశారు.

రైతుల సంక్షేమానికి అనేక ప్రభుత్వ పథకాలు

దేవరపల్లి, ఆగస్టు 14: రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని ఎమ్మెల్యే తలారి వెంకట్రావు అన్నారు. దేవరపల్లిలో సొసై టీ ఎరువుల గొడౌన్‌ నిర్మాణానికి ఆదివారం ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా గోపాలపురం నియోజకవర్గంలో 17సొసైటీలు ఉన్నాయని ప్రతీ సొసైటీకి రైతులు పండించే పంటను నిల్వ చేసుకోవడానికి, రైతులకు ఎరు వులు, విత్తనాలు అందించేందుకు గొడౌన్‌ నిర్మిస్తున్నట్టు చెప్పారు. దేవర పల్లి మండలంలో ఏడు సొసైటీలున్నాయని, ఒక్కో దానికి ప్రభుత్వం రూ.33 లక్షలు నిధులు మంజూరు చేసిందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కేవీకే దుర్గా రావు, ఏఎంసీ చైర్మన్‌ గన్నమని జనార్దనరావు, వైసీపీ కన్వీనర్‌ కూచిపూడి సతీష్‌, సర్పంచ్‌ వీరకుమారి, సొసైటీ అధ్యక్షుడు కవల శ్రీనివాస్‌, రామన్న పాలెం సర్పంచ్‌ కూచిపూడి బుల్లారావు, డాక్టర్‌ కేసిరాజు కాశీవిశ్వనాథం పాల్గొన్నారు. 

Read more