రైతుల వద్దే ధాన్యం కొనుగోళ్లు

ABN , First Publish Date - 2022-11-12T01:33:55+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్‌ సీజన్‌ ధాన్యాన్ని సేకరించి రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోళ్లు నిర్వహిస్తామని, ఈ విషయంలో రైతులు ఎటువంటి ఆందోళన చెందనవసరం లేదని జిల్లా కలెక్టర్‌ కృతికాశుక్లా స్పష్టంచేశారు.

రైతుల వద్దే ధాన్యం కొనుగోళ్లు

  • జిల్లా కలెక్టర్‌ కృతికాశుక్లా.. సామర్లకోట మండలంలో పర్యటన

సామర్లకోట, నవంబరు11: రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్‌ సీజన్‌ ధాన్యాన్ని సేకరించి రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోళ్లు నిర్వహిస్తామని, ఈ విషయంలో రైతులు ఎటువంటి ఆందోళన చెందనవసరం లేదని జిల్లా కలెక్టర్‌ కృతికాశుక్లా స్పష్టంచేశారు. శుక్రవారం సామర్లకోట మం డలం కెనాల్‌ రోడ్డులో ధాన్యం కొనుగోళ్లు నిర్వహిస్తున్న తీరును కలెక్టర్‌ పరిశీలించారు. అలాగే మండలంలోని వేట్లపాలెంలో మాసూళ్ల పనుల్లో ఉన్న రైతుల వద్దకు వెళ్లారు. జిల్లాలో ఎక్క డా పొరపాట్లకు తావులేకుండా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా సాగేందుకు క్షేత్రస్థాయి అధికారులు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ కృతికాశుక్లా అధికారులను ఆదేశించారు. అలాగే వేట్లపాలెంలోని రైతుభరోసా కేంద్రాలను పరిశీలించి ధాన్యంలో తేమశాతాన్ని పరీక్షిం చడాన్ని కలెక్టర్‌ పరిశీలించారు. అనంతరం గోనె సంచుల పంపిణీ కోసం నిల్వ ఉంచిన గోదా మును కూడా పరిశీలించారు. గ్రామంలో ఉన్న ఆదిలక్ష్మి రైస్‌మిల్లులో రైతుల నుంచి కొను గోలు చేసిన ధాన్యాన్ని, రవాణా అవుతున్న లారీలను కలెక్టర్‌ పరిశీలించారు. ధాన్యం నాణ్యతా ప్రమాణాలను సక్రమంగా పాటిస్తూ సాంకేతిక సిబ్బంది ప్రతీరోజూ రైతుల నుంచి ఉదయం సేకరించిన ధాన్యం నమూనాలను విశ్లేషించి తేమశాతం వెల్లడించి అదేరోజు సాయంత్రానికి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను పూర్తిచేసి సమీప రైస్‌మిల్లులకు తరలించాలన్నారు. ఏరోజు కొనుగోలు చేసిన ధాన్యానికి అదేరోజు తప్పనిసరిగా సాంకేతిక సహాయకులు రైతులకు ఎఫ్టీ వోలు జారీచేయాలని ఆదేశించారు. రైతు భరోసా కేంద్రాల్లో గోనె సంచులు అందుబాటులో ఉండేవిధంగా చూడాలని కలెక్టర్‌ ఆదేశించారు. తుని, కోటనందూరు తదితర మండలాల నుంచి తేమశాతం విశ్లేషించే పరికరాలను, సాంకేతిక సిబ్బందిని అవసరం మేరకు సమకూ ర్చాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. ఈ పర్యటనలో జిల్లా వ్యవసాయాధికారి ఎన్‌. విజయకుమార్‌, పౌరసరఫరాల జిల్లా మేనేజరు డి.పుష్పమణి, డీఎల్డీవో పాటంశెట్టి నారాయ ణమూర్తి, ఎంపీడీవో డి.శ్రీలలిత, తహశీల్దార్‌ ఎస్‌ఎల్‌ఎన్‌. కుమారి, మిల్లర్లు నున్న రామకృష్ణ, గుమ్మళ్ళ సత్యనారాయణ, గోలి రవి, నున్న నారాయణరావు, గుమ్మళ్ల రాజు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-12T01:33:55+05:30 IST

Read more