దోపిడీ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడాలి

ABN , First Publish Date - 2022-11-17T01:55:05+05:30 IST

ఆర్‌.ఎస్‌.ఎస్‌, బీజేపీ దోపిడీ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు అమరవీరుల మార్గంలో పోరాడాలని ఆంధ్రప్రదేశ్‌ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి(ఎ.పి.ఆర్‌.సి..ఎస్‌) కర్నాకుల వీరాంజనేయులు అన్నారు.

దోపిడీ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడాలి

గోకవరం, నవంబరు16: ఆర్‌.ఎస్‌.ఎస్‌, బీజేపీ దోపిడీ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు అమరవీరుల మార్గంలో పోరాడాలని ఆంధ్రప్రదేశ్‌ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి(ఎ.పి.ఆర్‌.సి..ఎస్‌) కర్నాకుల వీరాంజనేయులు అన్నారు. అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా గోకవరం లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ యూనియన్‌ కార్యాలయంలో ఉమ్మడి తూర్పుగోదావరిజిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం అమరవీరుల సంస్మరణ సభ నిర్వహించారు. ముందుగా రైతు కూలీ సంఘం నాయకులు, సభ్యులు ఆర్టీసీ బస్టాండ్‌ నుంచి అమరులకు నివాళలర్పిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నినదిస్తూ సభాస్ధలి వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు బాదంపూడి బాబూరావు అధ్యక్షతన జరిగిన సభలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరాంజనేయులు మాట్లాడుతూ దేశంలో దోపిడీ, పీడన, వివక్షత, అసమానతలు, దారిద్య్రం పోవాలని భారత విప్లవఇజంలో అనేకమంది మహనీయులు తమ ప్రాణాలను తునప్రాయంగా అర్పించారని కొనియాడారు. ఆదివాసీ సంరక్షణ చట్టాన్ని సవరణ చేసి తద్వారా ఆదివాసీలను బయటకు నెట్టేసి అటవీ సంపదను బహుళజాతి కంపెనీలకు అప్పగించే విధంగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేయడం తగదన్నారు. ఈకార్యక్రమంలో ఆంధ్రప్రధేశ్‌ రైతు కూలీ సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు వల్లూరి రాజబాబు, సహయ కార్యదర్శి కడితి సతీష్‌, డివిజన్‌ నాయకులు సురేష్‌, వడ్లమూరి మంగాదేవి, శ్రీ

Updated Date - 2022-11-17T01:55:05+05:30 IST

Read more