ప్రతి జిల్లాకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ హబ్‌

ABN , First Publish Date - 2022-09-10T06:39:58+05:30 IST

ప్రతి జిల్లాకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ హబ్‌ ఏర్పాటు చేసి యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్టు కలెక్టర్‌ కె.మాధవీలత అన్నారు.

ప్రతి జిల్లాకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ హబ్‌
ఉద్యోగం సాధించిన విద్యార్థినికి కాల్‌ లేటర్‌ అందిస్తున్న కలెక్టర్‌, ఎమ్మెల్యే

  • కలెక్టర్‌ మాధవీలత..నల్లజర్లలో మెగా జాబ్‌ మేళా

నల్లజర్ల, సెప్టెంబరు 9: ప్రతి జిల్లాకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ హబ్‌ ఏర్పాటు చేసి యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్టు కలెక్టర్‌ కె.మాధవీలత అన్నారు. శుక్రవారం వికాస ఆధ్వర్యంలో ఏకేఆర్‌జీ కళాశాలలో ఎమ్మెల్యే తలారి వెంకట్రావు అధ్యక్షతన మెగా జాబ్‌ మేళా నిర్వహించారు. ఈ సంద ర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో జాబ్‌ మేళా నిర్వహించి యువతకు ఉద్యోగవకాశం కల్పిస్తున్నట్టు చెప్పారు. ప్రతి నిరుద్యోగి జాబ్‌ మేళాను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎక్కడ జాబ్‌ వచ్చినా జాయిన్‌ అయ్యేందుకు విద్యార్దుల తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు. అనుభవం కలిగి ఉంటే జీవితంలో ఉన్నతోద్యోగాలు సాధించేందుకు ఉపయోగపడుతుందన్నారు. జిల్లాలో 8 వేల మంది డిగ్రీ విద్యార్థులకు ఈనెల 14 నుంచి ఇంటర్న్‌షిప్‌ కార్యక్రమం అమలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. పదో తరగతి తర్వాత బాలికలు విద్యకు దూరమవు తున్నట్టు గుర్తించి వారు చదివిన పాఠశాలలోనే ఇంటర్‌ క్లాసులు ఏర్పాటు చేసినట్టు కలెక్టర్‌ పేర్కొన్నారు. జిల్లాలో 19 బాలికల జూనియర్‌ కళాశాలలు ఏర్పాటు చేయ్యడం గర్వకారణమన్నారు. శుక్రవారం జాబ్‌ మేళాలో 400మంది ఉద్యోగాలకు ఎంపికైనట్టు వికాస కేంద్ర పీడీ లచ్చారావు పేర్కొన్నారు. 

ప్రతి గర్భిణి పౌష్టికాహరం తీసుకోవాలి.. అలాగే మండలంలోని జగన్నాథపురం అంగన్‌వాడీ కేంద్రంలో గర్భిణులకు సీమాంతాలు నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్‌ విచ్చేసి మాట్లాడారు. ప్రతి గర్భిణి విధిగా పౌష్టికాహరం తీసుకోవాలన్నారు. ప్రభుత్వం అందించే పౌష్టికాహరంతోపాటు కూరగాయలు,పండ్లు తీసుకోవాలన్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలు గర్భిణులకు మరింత అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమాల్లో ఏకేఆర్‌జీ విద్యా సంస్థ చైర్మన్‌ గోకుల్‌, తహశీల్దార్‌ మహ్మద్‌ మక్సూద్‌ ఆలీ, కారుమంచి రమేష్‌,మద్దిపాటి ప్రసాద్‌, గగ్గర శ్రీను, సీడీపీవో స్వరాజ్యలక్ష్మి, ప్రజాప్రతినిధులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.

Read more