-
-
Home » Andhra Pradesh » East Godavari » establish knowledge centre-NGTS-AndhraPradesh
-
అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి
ABN , First Publish Date - 2022-09-13T06:48:42+05:30 IST
విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రాన్ని రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేయాలని, సీతారామరాజు చదువుకున్న ఉల్లితోట బంగారయ్య స్కూలుకు అల్లూరి పేరును చేర్చి మార్పు చేయాలని జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పడాల వీరభద్రరావు కోరారు.

రాజమహేంద్రవరం అర్బన్, సెప్టెంబరు 12: విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రాన్ని రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేయాలని, సీతారామరాజు చదువుకున్న ఉల్లితోట బంగారయ్య స్కూలుకు అల్లూరి పేరును చేర్చి మార్పు చేయాలని జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పడాల వీరభద్రరావు కోరారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ మాధవీలతకు రెండు వినతిపత్రాలు అందజేసినట్టు ఆయన తెలిపారు. అల్లూరి జీవించిన 27 ఏళ్లలో 13 సంవత్సరాలు రాజమహేంద్రవరంలోనే నివాసం ఉన్నారని, అలాగే గోదావరి గట్టు ప్రాంతంలోని ఉల్లితోట బంగారయ్య స్కూల్లో 6వ తరగతి వరకూ సీతారామరాజు చదువుకున్నాడని కలెక్టర్‌కు తెలియజేశామన్నారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం ఏర్పాటుకు ఇచ్చిన వినతిపత్రాన్ని నగరపాలక సంస్థ కమిషనర్‌కు అందజేసి దీనిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో సంఘం కార్యదర్శి చీకట్ల శివన్నారాయణ, యర్ర ఉమామహేశ్వరరావు, ఎస్‌ఎస్ రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.