నిర్లక్ష్యం ఖరీదు నిండు ప్రాణం

ABN , First Publish Date - 2022-09-29T06:10:04+05:30 IST

అధికారుల నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలితీసుకుంది

నిర్లక్ష్యం ఖరీదు నిండు ప్రాణం
ఆత్మహత్యకు పాల్పడిన నాగరాజు

గతేడాది నలుగురు ఉద్యోగుల సస్పెన్షన్‌
చేయని తప్పుకు ఒకరి ఆత్మహత్య
మిగిలిన ముగ్గురికి ఉద్యోగాలు
కార్పొరేషన్‌ సిబ్బంది నిర్వాకం


రాజమహేంద్రవరం సిటీ, సెప్టెంబరు 28 :
అధికారుల నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. రాజమహేంద్రవరం నగరపాలక సం స్థలో జరిగిన డబ్బులు మాయం ఘటనలో బాధ్యులను చేస్తూ గతేడాది ఆగస్టు 31న  నలుగురిపై సస్పెండ్‌ వేటు వేశారు. ఈ ఘటనలో అసలు వ్యక్తిని వదిలేసినట్టు సమాచారం. చేయని పొరపాటుకు నలుగురు ఉద్యో గులు సుమారు ఏడాది పాటు ఉద్యోగాలు పోగొట్టుకుని ఒక పక్క కుటుంబ భారం.. మరో పక్క ఆర్థిక ఇబ్బం దులతో మానసిక క్షోభకు గురయ్యారు. అవమానంతో కుంగిపోయారు. చివరికి డబ్బులు రికవరీ చేస్తే ఉద్యో గాలు తిరిగివస్తాయని అఽధికారులు చెప్పడంతో రికార్డు అస్టింట్‌ మేకా నాగరాజు రూ.6 లక్షలు అప్పు చేసి కార్పొరేషన్‌కు జమచేశాడు. అయినా ఉద్యోగం తిరిగిరాక.. చేసిన అప్పులు తీర్చలేక, కుటుంబపోషణ కష్టమై తీవ్రమైన మానసిక సంఘర్షణలో ఈనెల 12న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా 15వ తేదీన మృతిచెందాడు. అతను చనిపోయిన తరువాత నలుగరు ఉద్యోగుల వ్యథ వెలుగులోకి వచ్చింది. అప్పటి వరకు సస్పెన్షన్‌ ఎత్తివేయాలని బాధిత ఉద్యోగులు ఎన్నోసార్లు అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోలేదు. నాగరాజు మృతిచెందిన తరు వాత గుట్టుచప్పుడు కాకుండా ఆగమేఘాలపై మిగిలిన ముగ్గురు ఉద్యోగులకు ఇటీవల తిరిగి పోస్టింగ్‌ ఇచ్చే శారు.ఈ పని కొద్ది రోజుల ముందు చేసి ఉంటే నాగరాజు ప్రాణం దక్కివుండేదనే విమర్శలు సహచర ఉద్యో గుల నుంచే వ్యక్తమవుతున్నాయి. కారుణ్య నియామకాల్లో నాగరాజు భార్యకు ఉద్యోగం ఇవ్వవచ్చు కాని అతను లేని లోటును కుటుంబానికి తీర్చలేరు కదా.. సంఘటనతో ఎలాంటి సంబంధలేని నాగరాజును సస్పెండ్‌  చేయడం తొలి పొరపాటు అయితే ద్విసభ్య కమిటీ నివేదికను బయటపెట్టకపోవడం ఎవరిని కాపాడేందుకనే విమర్శలు వినిపిస్తున్నాయి. మొత్తంమీద ఒక ఉద్యోగి మరణం మరొక ముగ్గురు ఉద్యోగులకు పోస్టింగ్‌లు ఇచ్చేలా చేసింది.ఈ ఘటన నాగరాజు కుటుంబానికి తీరని దుఃఖాన్ని మిగిల్చింది.

Updated Date - 2022-09-29T06:10:04+05:30 IST