విద్యుత్‌ చార్జీలు తగ్గించాలని టీడీపీ ఆందోళన

ABN , First Publish Date - 2022-04-05T06:27:54+05:30 IST

రాష్ట్రాన్ని అంధకార ఆంధ్రప్రదేశ్‌గా తయారు చేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని టీడీపీ నాయకులు ఎద్దేవా చేశారు.

విద్యుత్‌ చార్జీలు తగ్గించాలని టీడీపీ ఆందోళన

పి.గన్నవరం, ఏప్రిల్‌ 4: రాష్ట్రాన్ని అంధకార ఆంధ్రప్రదేశ్‌గా తయారు చేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని టీడీపీ నాయకులు ఎద్దేవా చేశారు.  పి.గన్నవవరం విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ వద్ద టీడీపీ నాయకులు ధర్నా నిర్వహించి అనంతరం మాట్లాడారు.  ఎలక్ర్టికల్‌ ఏఈ ఆచార్యులకు వినతిపత్రం అందిచారు. టీడీపీ మండల అధ్యక్షుడు తోలేటి సత్తిబాబు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మోకా ఆనందసాగర్‌, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డొక్కా నాథ్‌బాబు, పార్లమెంటరీ తెలుగుయువత అధ్యక్షుడు సీహెచ్‌ సతీష్‌రాజు, సంసాని పెద్దిరాజు, పులపర్తి రవికుమార్‌, మందపాటి కిరణ్‌కుమార్‌, నక్కా సునీల్‌, పెచ్చెటి వీరవెంకటసత్యనారాయణ, ఆరు మిల్లి లాల్‌బాబు, అంబటి కొటేశ్వరరావు, బొండాడ నాగమణి, మట్టపర్తి రామకృష్ణ, శేరు శ్రీనుబాబు, సత్యనారాయణరాజు, వేమన మల్లేశ్వరరావు, కేదాశి చిన్న, పిండి వరదరాజు, యండ్ర శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.Read more