-
-
Home » Andhra Pradesh » East Godavari » education reginal director madhusudhanarao-NGTS-AndhraPradesh
-
ప్రైవేటు పాఠశాలలు నిబంధనలు పాటించాలి
ABN , First Publish Date - 2022-09-10T06:23:03+05:30 IST
పద్దాపురం, సెప్టెంబరు 9: ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ప్రభుత్వం నిర్దేశించిన నియమ నిబంధనలను కచ్చితంగా పాటించాలని పాఠశాల విద్యాశా

పద్దాపురం, సెప్టెంబరు 9: ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ప్రభుత్వం నిర్దేశించిన నియమ నిబంధనలను కచ్చితంగా పాటించాలని పాఠశాల విద్యాశాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్ (ఆర్జేడీ) డి.మధుసూధనరావు స్పష్టం చేశారు. పట్టణంలో ఆయన నారాయణ విద్యాసంస్థను శుక్రవారం తనిఖీ చేసి సౌకర్యాలను పరిశీలించారు. అడ్మిషన్లు ఎన్ని జరుగుతున్నాయి, ఎంతమేర అనుమతులు ఉన్నాయ నే వంటి విషయాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఆయన వెంట ఎంఈవో సీహెచ్వీవీ సత్యనారాయణ ఉన్నారు.
సామర్లకోటలో పరిశీలన
సామర్లకోట: ప్రభుత్వం ముద్రించిన అచ్చుపుస్తకాలలోని సిలబస్ ఆధారంగానే ప్రైవేట్ పాఠశాలల్లో విద్యాబోధన నిర్వహించాలని ఆర్జేడీ డి.మధుసూధనరావు పేర్కొన్నారు. స్థానిక ఓ ప్రైవేట్ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ అచ్చుపుస్తకాల సిలబస్ విద్యాభోధన తీరు, మధ్యాహ్న భోజన పథకం నాణ్యతను పరిశీలించారు. ఎంఈవో ఎన్.కొండారెడ్డి పాల్గొన్నారు. జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలను సందర్శించిన ఆర్జేడీ హెచ్ఎం మీనామాధురితో పలు అంశాలపై సమీక్షించారు. డీవైఈవో ఆర్జేడీ రాజు పాల్గొన్నారు.