శుభారంభం!

ABN , First Publish Date - 2022-04-05T06:39:03+05:30 IST

రాజమహేంద్రవరం కేంద్రంగా నూతన తూర్పుగోదావరి జిల్లా ఆవిర్భవించింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వర్చువల్‌ మీటింగ్‌లో కొత్తల జిలాల్లను ప్రారంభించగా, బొమ్మూరు-వేమగిరి హైవేలోని హార్లిక్స్‌ ఫ్యాక్టరీకి ఎదు రుగా ఉన్న నేక్‌లో తూర్పు జిల్లా కలెక్టరేట్‌ ప్రారంభమైంది. దీనిని రాష్ట్రమంత్రి తానేటి వనిత,

శుభారంభం!
రాజమహేంద్రవరం పరిధిలోని బొమ్మూరులో ఏర్పాటుచేసిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్‌ భవనం

తూర్పుగోదావరి జిల్లా ఆవిర్భావం

అంతా వైసీపీ నేతలు, కేడర్‌ హడావుడి

బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్‌ మాధవీలత

పలువురు అధికారులు బాధ్యతల స్వీకరణ

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

రాజమహేంద్రవరం కేంద్రంగా నూతన తూర్పుగోదావరి జిల్లా ఆవిర్భవించింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వర్చువల్‌ మీటింగ్‌లో కొత్తల జిలాల్లను ప్రారంభించగా, బొమ్మూరు-వేమగిరి హైవేలోని హార్లిక్స్‌ ఫ్యాక్టరీకి ఎదు రుగా ఉన్న నేక్‌లో తూర్పు జిల్లా కలెక్టరేట్‌ ప్రారంభమైంది. దీనిని రాష్ట్రమంత్రి తానేటి వనిత, జిల్లా కలెక్టర్‌ మాధవీలత, ఎస్పీ ఐశ్వర్యరస్తోగి, ఎంపీ మార్గాని భరత్‌, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, జక్కంపూడి రాజా, డాక్టర్‌ సూర్యనారాయణరెడ్డి, శ్రీనివాస్‌నాయుడు, తలారి వెంకట్రావు, రుడా చైర్‌పర్సన్‌ మేడపాటి షర్మిళారెడ్డి తదితరుల సమక్షంలో ప్రారంభించారు. పాత ఉభ యగోదావరి జిల్లాల్లోని 19 మండలాలతో కలసి ఈ జిల్లా ఏర్పడిన సంగతి తెలిసిందే. సుమారు 18 లక్షల మంది జనాభాతో అఖండగోదావరికి ఇరువైపులా ఈ జిల్లా విస్తరించి ఉంది. తూర్పుగోదావరి జిల్లా  ఏర్పాటు పై ఎవరికీ అభ్యంతరాలు పెద్దగా లేవు. కేవలం పేరు మార్పు కోసం చాలామంది విన్నవించారు. కాటన్‌ పేరు వచ్చేలా చేయమని ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇక  మండపేట, రామచంద్రపురం ప్రాంతాల జనం మాత్రం రాజమహేంద్రవరం కేంద్రంగా ఉన్న జిల్లాలోనే ఉండా లని కోరుకుంటున్నారు. వారిని కోనసీమ జిల్లాలోకి మా ర్చడంతో వారు ఆందోళనబాట పట్టారు. తూర్పుగోదావరి జిల్లా ఆవిర్భావ సందర్భంగా రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌ కొవ్వూరు టోల్‌గేట్‌ నుంచి పాదయాత్ర నిర్వహించారు. మంత్రి వనిత తర్వాత వచ్చా రు. అదే దారిలో నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాసనాయు డు కూడా కేడర్‌తో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. 


జేసీ శ్రీధర్‌ బాధ్యతల స్వీకరణ

రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 4 : తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం కలెక్టర్‌ మాధవీలత బాధ్యతలు స్వీకరించగా, జేసీ సీహెచ్‌ శ్రీధర్‌ కూడా బాధ్యతలు స్వీకరించారు. ఇక డీఆర్వో చాంబర్‌ సిద్ధమైంది.  విశాఖ నుంచి రానున్నారు. ఆయన పేరు సుబ్బారావు.  వైటీసీలో  జిల్లా పరిశ్రమల శాఖ అధికారిగా డి.వేంకటేశ్వరరావు, అగ్నిమాపక శాఖ చీఫ్‌ ఆఫీసర్‌గా  సీహెచ్‌ మార్టిన్‌ లూఽథర్‌ బాధ్యతలు తీసుకున్నారు. డ్వామా ఏపీడీ జీ శ్రీనివాస్‌, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్‌ మాధవరావు, జిల్లా దేవాదాయశాఖ అఽధికారి టీవీఎస్‌ సుబ్రమణ్యంలు బాధ్యతలు స్వీకరించారు.


మరికొందరు..

తూర్పుగోదావరి జిల్లాకు ఇంకా కొత్త అధికారులు వస్తున్నారు. ఇప్పటికే పలువురు బాధ్యతలు చేపట్టారు.  హౌసింగ్‌  జిల్లా హెడ్‌గా బి.తారాచంద్‌ నియమితులయ్యారు. ఆయన ఇప్పటివరకూ జంగారెడ్డిగూడెంలో పనిచేశారు. ఎస్పీ ఎస్టీ సెల్‌ డీఎస్పీగా ఎ.శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఎక్సైజ్‌ డిపో డీఎంగా పనిచేస్తున్న ఎస్‌.లక్ష్మీకాంత్‌ను  డీపీ అండ్‌ ఈవోగా నియమించారు. జిల్లా విద్యాశాఖాధికారి అబ్రహం కాకినాడ డీఈవోగా పనిచేసి వచ్చారు. ఇంకా పలువురు బదిలీపై వస్తున్నారు.


జిల్లా విద్యాశాఖాధికారిగా అబ్రహం 

రాజమహేంద్రవరం సిటీ, ఏప్రిల్‌ 4 : తూర్పుగోదావరి జిల్లా తొలి విద్యాశాఖ అధికారిగా ఎస్‌ అబ్రహం నియమితులయ్యారు. సోమవారం ఆయన రాజమహేంద్రవరం కోటగుమ్మం వద్ద గల మండల వనరుల కేంద్రంలో ఏర్పా టుచేసిన తాత్కలిక డీఈవో కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. తొలుత ఆ కార్యాలయాన్ని ప్రాంతీయ విద్యా సంచాలకులు డి మధుసూదనరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా అర్బన్‌ డీఐ బి దిలీప్‌కుమార్‌, కోరుకొండ, మారేడుమిల్లి, గోకవరం, రంపచోడవరం, రాజానగరం, కడి యం ఎంఈవోలు,  ఏపీ టీచర్స్‌ గిల్డ్‌ రాష్ట్ర అధ్యక్షుడు బి చిట్టిబాబు, సీఆర్‌పీలు, డీవైఈవో కార్యాలయ సిబ్బంది డీఈవోకు అభినందనలు తెలిపారు. 


సెక్షన్లు కుదింపు

కొత్త జిల్లాలకు సంబంధించి శాఖలను భారీగానే కుదించారు. పాత తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్‌ పరిధిలోని వివిధ శాఖల పోస్టులను నాలుగు ముక్కలుగా చేసి,  తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ, పాడేరు కేంద్రంగా ఉన్న అల్లూరి జిల్లాలకు పంపిణీ చేశారు.  కలెక్టరేట్‌కు 8 సెక్షన్లు ఉండేవి. ప్రస్తుతం మూడు సెక్షన్లతోనే సరిపెట్టారు. జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలో 25 మంది ఉద్యోగులు ఉండేవారు. కాని తూర్పుగోదావరికి కేవలం నాలుగు పోస్టులు మాత్రమే ఇచ్చారు. ఇలా చాలా శాఖలకు సంబంధించిన ఉద్యోగులను విభజించారు. తర్వాత ఏమైనా మార్పులు చేస్తారేమో చూడాలి.


Updated Date - 2022-04-05T06:39:03+05:30 IST