ప్రజా సమస్యలు పరిష్కరించండి

ABN , First Publish Date - 2022-05-24T07:04:03+05:30 IST

గోపాలపురం, మే 23: దీర్ఘకాలికంగా నెలకొన్న ప్రజా సమ స్యలను పరిష్కరించాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు కలెక్టర్‌ మాధవీలతకు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సోమవారం నిర్వహించిన ‘స్పందన’ కార్యక్రమంలో అందజేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నియోజకవర్గ స్థాయిలో ఎన్నో దీర్ఘకాలిక సమస్యలు ప్రజలను వెంటాడుతున్నాయన్నారు. అందులో భాగంగా మెట్ట ప్రాంతానికి దాహార్తి

ప్రజా సమస్యలు పరిష్కరించండి
గోపాలపురంలో జిల్లా కలెక్టర్‌ మాధవీలతకు వినతిపత్రం అందిస్తున్న మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకులు

కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన మాజీ ఎమ్మెల్యే ముప్పిడి

సత్యసాయి మంచినీటి పథకాన్ని పునరుద్ధరించాలని డిమాండు

ఇళ్ల స్థలాల పంపిణీ సక్రమంగా లేదంటూ ఫిర్యాదు

గోపాలపురం, మే 23: దీర్ఘకాలికంగా నెలకొన్న ప్రజా సమ స్యలను పరిష్కరించాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు కలెక్టర్‌ మాధవీలతకు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సోమవారం నిర్వహించిన ‘స్పందన’ కార్యక్రమంలో అందజేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నియోజకవర్గ స్థాయిలో ఎన్నో దీర్ఘకాలిక సమస్యలు ప్రజలను వెంటాడుతున్నాయన్నారు. అందులో భాగంగా మెట్ట ప్రాంతానికి దాహార్తి తీర్చే సత్యసాయి మంచినీటి సేవా పథకాన్ని పునః ప్రా రంభించాలని అన్నారు. అదేవిధంగా నీటి సరఫరా నిలిచిపోవ డంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, అలాగే ఎన్నో కార్మిక కుటుంబాలు ఉపాధి కోల్పోయి రోడ్డునపడ్డాయని అన్నారు. ప్రభుత్వమే నిబంధనలు ఉల్లంఘించి మరీ నాన్‌లేఅవుట్‌లో ప్రభుత్వ మద్యం దుకాణాన్ని ఏర్పాటుచేయడం సరికాదన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి సూదిలేదు, దూదిలేదు అన్నచందంగా తయా రైందన్నారు. సిబ్బంది కొరతతోపాటు మౌలిక వసతులు లేకపోవ డం బాధకరమని అన్నారు. ఈ ప్రాంతంలో పేద, మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉన్నారని, ప్రైవేటు ఆసుపత్రుల్లో బిల్లులు చెల్లించే స్థాయి వారికి లేదన్నారు. అదేవిధంగా ఇళ్ల స్థలాల పంపి ణీ కూడా సక్రమంగా జరగలేదన్నారు. అనువుగాని ప్రదేశాన్ని ఇళ్ల స్థలాలకు కేటాయించి పేదలను అవమానపరచడమేనని అన్నారు అలాగే అంతర్గత రహదారులు అధ్వానంగా తయార య్యాయని కలెక్టర్‌కు ఇచ్చిన వినతిపత్రంలో పేర్కొన్నామని ఆయ న చెప్పారు. అధికారులు స్పందించి సత్వరం సమస్యలు పరిష్క రించకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. మండల పార్టీ అధ్య క్షుడు సత్యనారాయణ, నాయకులు జేష్ట శ్రీధర్‌, చదలవాడ ప్రసాద్‌ తదితరులు వినతిపత్రం ఇచ్చిన వారిలో ఉన్నారు.


గోపాలపురంలో నియోజకవర్గ స్థాయి ‘స్పందన’కు 164 వినతులు

గోపాలపురం, మే 23: స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన నియో జకవర్గ స్థాయి స్పందన కార్యక్రమానికి వినతులు వెల్లువెత్తాయి. మొత్తం 164 వినతులు రాగా, వాటి లో 64 వినతులు రెవెన్యూ శాఖకు చెందినవే. దీంతో ఈ కార్యక్రమానికి హాజరైన కలెక్టర్‌ కే. మాధవీలతకు వినతిపత్రాలు ఇచ్చేందుకు దర ఖాస్తుదారులు అధిక సంఖ్యలో చేరుకున్నారు. ఇదే సమయంలో వైసీపీకి చెందిన పలువురు నాయ కులు వచ్చి మండల స్థాయి అధికారులు తమ మాట వినడం లేదంటూ కలెక్టర్‌ దృష్టికి తీసు కెళ్లారు. అనంతరం ఆమె మాట్లాడుతూ స్పందన కార్యక్రమానికి వచ్చిన ప్రతీ ఫిర్యాదును యుద్ధ ప్రతిపాదికన పరిష్కరిస్తామని అన్నారు. అదే విధంగా అధికారుల తీరుతెన్నులను పరిశీలిస్తా మని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్‌ రత్నమణి, ఎంపీడీవో ఆర్‌.ఽశ్రీదేవి, ఆయా శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-24T07:04:03+05:30 IST