-
-
Home » Andhra Pradesh » East Godavari » east godavari ap news tiger-MRGS-AndhraPradesh
-
రెండు రోజుల్లో రాజవొమ్మంగి అడవులకు పెద్దపులి?
ABN , First Publish Date - 2022-06-07T22:06:44+05:30 IST
జిల్లాలోని పలు ప్రాంతాల్లో పెద్దపులి హల్‌చల్ చేస్తోంది. పెద్దపులి రాకతో ఆ ప్రాంత ప్రజలు బహుగా భయపడుతున్నారు. ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని బ్రతుకుతున్నారు.

తూర్పుగోదావరి: జిల్లాలోని పలు ప్రాంతాల్లో పెద్దపులి హల్‌చల్ చేస్తోంది. పెద్దపులి రాకతో ఆ ప్రాంత ప్రజలు చాలా భయపడుతున్నారు. ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని బ్రతుకుతున్నారు. ప్రస్తుతం కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం వమ్మంగి పొదురుపాక శరభవరం పొలిమేరల్ల నుండి పెద్దిపాలెం పొట్టి కొండ ప్రదేశానికి పులి చేరుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఆ ప్రదేశానికి పెద్దపులి చేరుకున్నట్లు పాదముద్రలతో అటవీశాఖ అధికారులు గుర్తించారు. దాంతో పెద్ద పాలెం, కిత్త మూరి పేట, వేముల పాలెం పరిసర గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళనచెందుతున్నారు.
పెద్దపులి.. పెద్దిపాలెం సుబ్బారెడ్డి సాగర్ కుడి కాలువ గట్టు మీదుగా.. గోకవరం సుబ్బారెడ్డి సాగర్ సమీప కొండల్లోకి వెళ్లినట్టు ఫారెస్ట్ సిబ్బంది గుర్తించారు. గోకవరం నుంచి ఎరకంపాలెం, మెట్టు చింత, ఉలి గోగుల, వంతాడ కొండల పరిసరాల్లో ఉన్నట్టు సమాచారం. రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాకు సమీపంలోఉన్నట్టు కూడా అంచనా అధికారులు వేస్తున్నారు. అక్కడ నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజవొమ్మంగి అడవులకు రెండు రోజుల్లో చేరుకుంటుందని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు.