ఈలకొలనులో బాదుడే బాదుడు

ABN , First Publish Date - 2022-11-03T00:47:09+05:30 IST

రంగంపేట మండలం ఈలకొలను గ్రామంలో బుధవారం టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు.

ఈలకొలనులో బాదుడే బాదుడు

బిక్కవోలు, నవంబరు 2: రంగంపేట మండలం ఈలకొలను గ్రామంలో బుధవారం టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా పెంచిన విద్యుత్‌, నిత్యావసర వస్తువులు, గ్యాస్‌, పెట్రోల్‌, ఆర్‌టీసీ చార్జీలు తగ్గించాలంటూ నిరసన వ్యక్తం చేస్తూ గ్రామంలో పాదయాత్ర చేశారు. పెంచిన ధరల వివరాలను తెలుపుతూ కరపత్రాలను ఇంటింటికీ పంచారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడా కనబడడంలేదని, అప్పులు మాత్రం కనిపిస్తున్నాయన్నారు. ఈలకొలను ఆర్‌ అండ్‌ బీ రోడ్డు వేసిన మూడునెలలకే ఛిద్రమయ్యిందని, అయినా అధికారులపై చర్యలు శూన్యమన్నారు. ప్రజలందరూ వైసీపీ పాలనపై తీవ్ర అసంతృప్తితో వున్నారని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీడీపీ విజయం ఖాయమన్నారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా ప్రధానకార్యదర్శి ఆళ్ల గోవిందు, టీడీపీ నేతలు త్రిమూర్తులు, వెంకటరామారెడ్డి, సుబ్బారెడ్డి, సాయిబాబు, దొరరాజు, గోపీ పాల్గొన్నారు.

చెట్లు కొట్టేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

ఈలకొలను ఆర్‌ అండ్‌ బీ రోడ్డు ప్రక్కన యేళ్ల తరబడి వున్న చెట్లను కొట్టేసిన విద్యుత్‌ అధికారులపైన, దగ్గరుండి నరికించిన వారిపైనా వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. బుధవారం ఆయన చెట్లు నరికిన ప్రాంతాన్ని పరిశీలించారు. వెంటనే అటవీశాఖ, రెవెన్యూ శాఖలు చర్యలు తీసుకోకపోతే తమ పార్టీ తరపున తీవ్ర ఉద్యమం చేపడతామని ఆయన హెచ్చరించారు.

Updated Date - 2022-11-03T00:47:11+05:30 IST