మత్తులో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దు

ABN , First Publish Date - 2022-04-24T06:53:52+05:30 IST

డ్రగ్స్‌ వంటి మత్తు పదార్ధాలను వినియోగించి విద్యార్థులు విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని అమలాపురం సీనియర్‌ సివిల్‌ జడ్జి కె.శైలజ పేర్కొన్నారు.

మత్తులో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దు

అమలాపురం టౌన్‌, ఏప్రిల్‌ 23: డ్రగ్స్‌ వంటి మత్తు పదార్ధాలను వినియోగించి విద్యార్థులు  విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని అమలాపురం సీనియర్‌ సివిల్‌ జడ్జి కె.శైలజ పేర్కొన్నారు. విద్యార్థులే లక్ష్యంగా  డ్రగ్స్‌ వినియోగం పెరుగుతుందని, అటువంటి పరిస్థితుల్లో విద్యార్థులు స్మగ్లర్ల చేతిలో కీలు బొమ్మలు కాకుండా తమ జీవితాలను కాపాడు కోవాలని హితవు పలికారు. భట్లపాలెం బీవీసీ ఇంజనీరింగ్‌ కళాశాలలో శనివారం మండల న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. విద్యా ర్థు లకు మత్తు పదార్ధాల వాడకం, వాటివల్ల ఒనగూరే నష్టాలు, చట్టాల్లో ఉన్న తీవ్రత గురించి ఆమె విద్యార్థులకు వివరిం చారు. లోక్‌అదాలత్‌ సభ్యుడు వెంపరాల భాస్కరశాస్ర్తి, కళా శాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జేవీజీ రామారావు, పీఎల్వీ ఆనం దకుమార్‌, హరిశ్రీపద్మ తదితరులు పాల్గొన్నారు. Read more