బాధ్యతలు స్వీకరించిన డీఆర్‌డీఏ పీడీ సుభాషిణి

ABN , First Publish Date - 2022-11-08T01:28:53+05:30 IST

డీఆర్‌డీఏ పీడీగా ఎస్‌ సుభాషిణి సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాధవీలతను ఆమె మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరేలా కృషిచేస్తానన్నారు. ‘పేదలందరికీ ఇళ్లు’ పథకంలో భాగంగా స్వయం స

బాధ్యతలు స్వీకరించిన డీఆర్‌డీఏ పీడీ సుభాషిణి
జిల్లా కలెక్టరు మాధవీలతను కలుసుకున్న డీఆర్‌డీఏ కొత్త పీడీ సుభాషిణి

రాజమహేంద్రవరం రూరల్‌ నవంబరు 7: డీఆర్‌డీఏ పీడీగా ఎస్‌ సుభాషిణి సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాధవీలతను ఆమె మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరేలా కృషిచేస్తానన్నారు. ‘పేదలందరికీ ఇళ్లు’ పథకంలో భాగంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు, గ్రూపులో లేనివారిని గ్రూపులుగా ఏర్పాటుచేసి అదనపు బ్యాంకు రుణాలు అందించేలా కృషిచేస్తా మన్నారు. పీడీ సుభాషిణికి డీఆర్‌డీఏ కార్యాలయ సిబ్బంది అభినందనలు తెలిపారు.

Updated Date - 2022-11-08T01:28:53+05:30 IST

Read more