డ్రెయిన్లలో వలకట్లు తొలగించాలి

ABN , First Publish Date - 2022-12-10T00:58:45+05:30 IST

మండల పరిధిలోని లోయర్‌ కౌశిక, పంచనది తదితర డ్రెయిన్లలో వలకట్లు తొలగించి ముంపు నుంచి రక్షణ కల్పించాలని ఎంపీపీ యిళ్ల శేషగి రిరావు డ్రెయిన్స్‌ అధికారులను కోరారు.

డ్రెయిన్లలో వలకట్లు తొలగించాలి

అల్లవరం, డిసెంబరు 9: మండల పరిధిలోని లోయర్‌ కౌశిక, పంచనది తదితర డ్రెయిన్లలో వలకట్లు తొలగించి ముంపు నుంచి రక్షణ కల్పించాలని ఎంపీపీ యిళ్ల శేషగి రిరావు డ్రెయిన్స్‌ అధికారులను కోరారు. అల్లవరంలో చైర్‌ పర్సన్‌ ఉండ్రు సుదర్శనరావు అధ్యక్షతన మండల వ్యవ సాయ సలహా మండలి సమావేశం జరిగింది. ఈనెల20 లోగా దాళ్వా వరి నారుమడులు పూర్తిచేయాలని, రానున్న రెండు రోజుల్లో మాండస్‌ తుఫాన్‌ కారణంగా వరికోతలు వాయిదా వేయాలని మండల వ్యవసాయాఽ దికారి ఎన్‌వీవీ సత్యనారాయణ అన్నారు. సమావేశంలో పశు వైద్యాధికారి డాక్టర్‌ ఎం.నారాయణరావు, ఇరిగేషన్‌ అధికారి జి.రాధాకృష్ణ, సలహా మండలి సభ్యులు నిమ్మకాయల చంద్రశేఖర్‌, మొల్లేటి సత్యసాయిబాబా పాల్గొన్నారు.

Updated Date - 2022-12-10T00:58:46+05:30 IST