గోదావరి జిల్లాకు కాటన్‌ పేరు సముచితం

ABN , First Publish Date - 2022-02-23T05:59:19+05:30 IST

రాజమహేంద్రవరం కేంద్రంగా ఏర్పాటు కానున్న కొత్త జిల్లాకు కాటన్‌ గోదావరి జిల్లాగా పేరు పెట్టడం ఎంతో సముచితమని ఏపీ ఎన్జీవో అసోసియేషన్‌ నాయకులు అన్నారు.

గోదావరి జిల్లాకు కాటన్‌ పేరు సముచితం
ధవళేశ్వరం: ఏపీ ఎన్జీవో సంఘ నాయకులకు వినతిపత్రం ఇస్తున్న దృశ్యం

  • ఏపీ ఎన్జీవో అసోసియేషన్‌ నాయకులు

ధవళేశ్వరం, ఫిబ్రవరి 22: రాజమహేంద్రవరం కేంద్రంగా ఏర్పాటు కానున్న కొత్త జిల్లాకు కాటన్‌ గోదావరి జిల్లాగా పేరు పెట్టడం ఎంతో సముచితమని ఏపీ ఎన్జీవో అసోసియేషన్‌ నాయకులు అన్నారు. గిరిజాల బాబు ఆధ్వర్యంలో కాటన్‌ గోదావరి జిల్లా సాధన సమితి సభ్యులు చిలుకూరి శ్రీనివాసరావు, సర్కార్‌ భాషా తదితరులు మంగళవారం ధవళేశ్వరంలోని ఎన్జీవో సంఘం కార్యాలయంలో ఉద్యోగ సంఘ నాయకులు బొబ్బిలి శ్రీనివాసరావు, బి.లక్ష్మణు లను కలిసి వినతిపత్రం అందజేశారు. కాటన్‌ గోదావరి జిల్లాకు మద్దతు తెల పాలని కోరారు. ఈ సందర్భంగా ఎన్జీవో సంఘ నాయకులు మాట్లాడుతూ కాటన్‌ గోదావరి జిల్లాకు తమ పూర్తి మద్దతు ఇస్తూ ఇప్పటికే ఎన్జీవో అసోసి యేషన్‌ సమావేశంలో ఏకగీవ్ర తీర్మానం చేశామని తెలిపారు. సాధనా సమితి కార్యాచరణకు పూర్తి మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో ఉద్యోగ సంఘ నాయకులు కేఎన్‌ గౌరీశంకర్‌, పాలిక రాజబాబు, బీఎస్‌ శేషుకుమార్‌, ఎం.స తీష్‌, సయ్యద్‌  బాబ్జి పాల్గొన్నారు.

Read more