అవినీతి పాలకులను తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధం

ABN , First Publish Date - 2022-09-28T06:58:14+05:30 IST

అవినీతి పాలకులను తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమ అన్నారు. మంగళవారం ఆయన మండలంలోని జెడ్‌.రాగంపేట గ్రామ శివారులో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ, మండల పార్టీ అధ్యక్షుడు పోతుల మోహన్‌రావు ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం, పదవులు పొందినవారికి ప్రమాణ స్వీకార మహోత్సవం నిర్వహించారు.

అవినీతి పాలకులను తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధం
నాయకులకు నియామక పత్రాలు

మాజీ మంత్రి దేవినేని ఉమ
గండేపల్లి, సెప్టెంబరు27: అవినీతి పాలకులను తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమ అన్నారు. మంగళవారం ఆయన మండలంలోని జెడ్‌.రాగంపేట గ్రామ శివారులో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ, మండల పార్టీ అధ్యక్షుడు పోతుల మోహన్‌రావు ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం, పదవులు పొందినవారికి ప్రమాణ స్వీకార మహోత్సవం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా దేవినేని, జిల్లా పార్టీ ఇన్‌చార్జి జ్యోతుల నవీన్‌ హాజరయ్యారు. తొలుత మాజీ మంత్రి ఉమ మాట్లాడుతూ రాష్ట్రంలో అవినీతి పాలన కొనసాగుతోందని, ఆ పాలనలతో ప్రజలు విసిగిపోయి చరమగీతం పాడేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. 40 ఏళ్ల రాజకీయాల్లో ఇటువంటి నీచమైన రౌడీపాలన ఎక్కడా చూడలేదని మండిపడ్డారు. టీడీపీ పాలనలో చంద్రబాబు రాష్ట్రానికి ఎన్నో పెట్టుబడులు తెచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధిపరిస్తే ప్రస్తుత పాలనలో ఆ పార్టీ నాయకులు దోచుకుంటూ దాచుకుం టున్నారని, ప్రజాపాలన గాలికి వదిలేశారని విమర్శించారు. రాజధాని కోసం 34 వేల ఎకరాలు రైతులు త్యాగాలు చేసి భూములు ఇస్తే ఆ రైతులను ప్రభుత్వం కక్ష సాధింపు చర్యగా వారిపై కేసులు పెట్టి లాఠీలతో కొట్టించి రోడ్డెక్కించిన ఘనత సీఎం జగన్‌దే అన్నారు. జగన్‌ అవినీతి పాలనతో మైనింగ్‌, గ్రానైట్‌, ఇసుక అక్రమ రవాణా, నకిలీ మద్యం ఏదీ వదలకుండా దొరికినంత దోచుకుంటూ రాష్ట్రాన్ని అఽథోగతిపాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్చి తెలుగు వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని విమర్శించారు. టీడీపీ హయాంలో పోలవరం, పురుషోత్తపట్నం మరెన్నో ప్రాజెక్టులను వేగవంతంగా ముందుకు తీసుకెళ్లామని, వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక్క ప్రాజెక్టు కూడా ముందుకు వెళ్లిన దాఖలాలు లేవన్నారు. నియోజకవర్గంలో జ్యోతుల బలమైన నాయకుడని, చాగల్నాడు ఎత్తిపోతల పథకం కోసం మంత్రి పదవిని తృణప్రాయంగా వదులుకున్న మహానాయకుడని అన్నారు. జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ భావితరాల భవిష్యత్‌ బాగుండాలంటే టీడీపీని గెలిపించుకోవాల్సిన అవ సరం ఎంతైనా ఉందన్నారు. టీడీపీ పాలనలో చంద్రబాబు రాష్ట్రానికి సంపదలు తీసుకొస్తే జగన్‌ పాలనలో అవినీతి అక్రమాలు, రౌడీ రాజకీయాలు రాజ్యమేలుతున్నాయన్నారు. ఈ దుష్ట పరి పాలనకు ముగింపు పలకాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. టీడీపీ నేత దేవినేని ఉమ నీటిపారుదలశాఖా మంత్రిగా  పనిచేసిన సమయంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వేగవంతం చేయడంతోపాటు కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టి రైతులకు సాగునీరు అందించారన్నారు. వైసీపీ ప్రభుత్వంలో పనిచేసిన నీటిపారుదల శాఖా మంత్రికి ఓనమాలు కూడా రావని, ఎక్కడ ప్రాజెక్టులు అక్కడే చతికలపడ్డాయన్నారు. అలాగే అమరావతి యాత్ర కిర్లంపూడి మీదుగా సాగు తుందని, ఆ యాత్రలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. అలాగే నవీన్‌ చేపడుతున్న పాదయాత్రను విజయవంతం చేయాలన్నారు. దశమి అనంతరం ఆత్మీయ సమావేశాలు ఏర్పా టుచేసి గ్రామాల్లో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకుంటామన్నారు. నవీన్‌ మాట్లాడుతూ హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్పునకు నిరసనగా ఎన్టీఆర్‌ విగ్రహానికి పాలభిషేకం చేసి నిరసన లు వ్యక్తం చేయాలని కోరారు. అనంతరం పార్టీ పదవులు పొందిన నాయకులకు శాలువా కప్పి సత్కరించి నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కోర్పు లచ్చయ్య దొర, ఎస్‌వీఎస్‌ అప్పలరాజు, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు కోర్పు సాయి తేజ్‌, మండల పార్టీ అధ్యక్షులు పోతుల మోహన్‌రావు, మారిశెట్టి భద్రం, నీలాద్రిరాజు, యర్రం శెట్టి వెంకలక్ష్మి బాబ్జి, అడబాల భాస్కరరావు, సుంకవిల్లి రాజు, సోమవరం రాజు, కురిపురి చౌదరి, సుంకవిల్లి సత్య నారాయణ, తెలగరెడ్డి భద్రరావు తదితరులు పాల్గొన్నారు.

Read more