డీఈఎల్‌ఈడీ పరీక్షలకు మార్చి 12లోపు ఫీజు చెల్లించాలి

ABN , First Publish Date - 2022-03-04T05:55:17+05:30 IST

డిప్లమో ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ (డీఈఎల్‌ఈడీ) మొదటి సెమిస్టర్‌ పరీక్షలు 2020-2022 బ్యాచ్‌కు సంబంధించి ఈఏడాది ఏప్రిల్‌లో నిర్వహించనున్నారు.

డీఈఎల్‌ఈడీ పరీక్షలకు మార్చి 12లోపు ఫీజు చెల్లించాలి

కాకినాడరూరల్‌, మార్చి 3: డిప్లమో ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ (డీఈఎల్‌ఈడీ) మొదటి సెమిస్టర్‌ పరీక్షలు 2020-2022 బ్యాచ్‌కు సంబంధించి ఈఏడాది ఏప్రిల్‌లో నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు సంబంధించిన ఫీజును ఎటువంటి అపరాధ రుసుము లేకుండా మార్చి 10 వరకు, రూ.50 అపరాధ రుసుముతో 12లోపు చెల్లించాలని డీఈవో ఎస్‌.అబ్రహాం తెలిపారు. అదే విధంగా సంబంధిత కళాశాలల ప్రిన్సిపాల్స్‌ పరీక్ష రుసుమును ప్రభుత్వ ఖాతాకు మార్చి 17లోపు, నామినల్‌ రోల్స్‌, ఆన్‌లైన్‌ దరఖాస్తులను డీఈవో కార్యాలయంలో ఈనెల 21లోపు సమర్పించాలన్నారు. ఆన్‌లైన్‌లో శుక్రవారం నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. రెగ్యులర్‌ విద్యార్థులకు పరీక్ష రుసుము రూ.150 కాగా రెగ్యులర్‌, ప్రైవేట్‌ విద్యార్థులు నామినల్‌ రోల్స్‌ ప్రత్యేకంగా సమర్పించాలని ఫీజును గేట్‌ వే ద్వారా మాత్రమే చెల్లించాలని డీఈవో సూచించారు.

Updated Date - 2022-03-04T05:55:17+05:30 IST