ఆ మృతదేహం అదృశ్యమైన గ్రామ వలంటీర్‌దే

ABN , First Publish Date - 2022-06-11T06:24:15+05:30 IST

గోదావరిలో లభ్యమైన మృతదేహం ఇటీవల అదృశ్యమైన గ్రామవలంటీర్‌దేనని గ్రామస్తులు ఆం దోళనకు దిగారు.

ఆ మృతదేహం అదృశ్యమైన గ్రామ వలంటీర్‌దే

అంబులెన్స్‌ను అడ్డుకుని  గ్రామస్తుల ఆందోళన

అయినవిల్లి, జూన్‌ 10: గోదావరిలో లభ్యమైన మృతదేహం ఇటీవల అదృశ్యమైన గ్రామవలంటీర్‌దేనని గ్రామస్తులు ఆం దోళనకు దిగారు. పోలీసులు నచ్చజెప్పడంతో వారు ఆందోళన విరమించారు. గౌతమి గోదావరి నదిలో కోటిపల్లి సమీపాన శుక్రవారం లభ్యమైన గుర్తుతెలియని మృతదేహాన్ని అయిన విల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ మృతదేహం గుర్తు పట్టడానికి వీలులేని రీతిలో ఉంది. ఆ మృతదేహాన్ని పోలీసులు అమలాపురం ఏరియా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం అంబులెన్సులో తరలిస్తుండగా అయినవిల్లి గ్రామ స్తులు ముక్తేశ్వరం సెంటర్‌లో అడ్డుకుని ఆందోళనకు  దిగారు. ఆ మృతదేహం ఈనెల6న అయినవిల్లి న్యూకాలనీకి చెందిన గామ వలంటీరు దుర్గాప్రసాదేననే అనుమానంతో గ్రామ స్తులు ఆందోళన చేపట్టారు. అయితే వారి కుటుంబీకులు కూడా ఆ మతదేహాన్ని గుర్తుపట్టకపోవడంతో డీఎన్‌ఏ పరీక్ష ద్వారా పరీక్షించి నిర్థారిస్తామరి రూరల్‌ సీఐ పి.వీరబాబు గ్రామస్తులకు హామీ ఇవ్వడంతో ఆందోళన విమరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. 



Updated Date - 2022-06-11T06:24:15+05:30 IST