ధర్మవరంలో గ్రామాభివృద్ధికి చర్యలు

ABN , First Publish Date - 2022-02-19T05:48:52+05:30 IST

మండలంలో ధర్మవరంలో గ్రామాభివృద్ధికి ఎమ్మె ల్యే పర్వత ప్రసాద్‌ సహకారంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తు న్నామని రాష్ట్ర సాహిత్య అకాడమీ డైరెక్టర్‌ మారిశెట్టి శివకుమార్‌ చెప్పారు.

ధర్మవరంలో గ్రామాభివృద్ధికి  చర్యలు

 రాష్ట్ర సాహిత్య అకాడమీ డైరెక్టర్‌ శివకుమార్‌

ప్రత్తిపాడు,  ఫిబ్రవరి 18: మండలంలో ధర్మవరంలో గ్రామాభివృద్ధికి ఎమ్మె ల్యే పర్వత ప్రసాద్‌ సహకారంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తు న్నామని రాష్ట్ర సాహిత్య అకాడమీ డైరెక్టర్‌ మారిశెట్టి శివకుమార్‌ చెప్పారు. శుక్రవారం ధర్మవరం గ్రామంలో ఇంటింటికి తిరిగి గ్రామాభివృద్ధి అంశాల కరపత్రాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా శివకుమార్‌ మాట్లాడుతూ ధర్మవరంలో ఎమ్మెల్యే పర్వత ప్రసాద్‌ కృషి మేరకు 1.50లక్షల లీటర్ల ఓవర్‌ హెడ్‌ ట్యాంక్‌కు, కళ్యాణ మండపానికి అనుమతులు లభించాయన్నారు. జగన న్న కాలనీలో భాగంగా గ్రామంలో వందలాది మంది లబ్ధిదారుల గృహాలు నిర్మాణ దశలోఉన్నాయని, దీనివల్ల  గ్రామం మరింత అభివృద్ధి చెందుతుం దని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ బెంతుకుర్తి సుశీల అబ్బాయి, ఎంపీటీసీ జువ్వల సుజాత బాబులు, గ్రామపెద్దలు జువ్వల చినబాబు, మానిపల్లి చంటి, బొల్లు తాతాజీ, కిలాడి బాబ్జి, రాపా గుర్రాజు, విద్యాకమిటీ చైర్మన్‌లు యాళ్ళ ఏసుబాబు, మాగాపు శివ, కోన తాతారావు పాల్గొన్నారు. Read more