విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి

ABN , First Publish Date - 2022-12-13T01:13:35+05:30 IST

విద్యుదాఘాతంతో వేర్వేరు సంఘటనల్లో ఇద్దరు మృతి చెందారు. నల్లజర్ల మండలం ఆవపాడులో ఆయిల్‌ పాం గెలలు కోస్తూ ప్రమాదవశాత్తూ విద్యుత్‌ వైర్లకు తగిలి అయినపర్తి సీతయ్య మృతి చెందాడు. అలాగే సీతానగరం మండలం రఘుదేవపురంలో విద్యుత్‌ వైర్లు తగిలి సమరకుర్తి వాడపల్లి మృతిచెందాడు.

విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి

నల్లజర్ల, డిసెంబరు 12: నల్లజర్ల మండలం ఆవపాడులో సోమవారం అయిల్‌ పాం గెలలు కోస్తూ ప్రమాదవశాత్తూ గెలలు కోసే ఇసుప గెడ విద్యు త్‌ వైర్లకు తగలడంతో అదే గ్రామానికి చెందిన అయినపర్తి సీతయ్య (38)అక్కడికక్కడే మృతి చెందాడు. కూలీ పనికి వెళ్లి జీవనం సాగించే సీతయ్యకి భార్య, ఓ కుమార్తె ఉన్నారు. కుటుంబాన్ని పోషించే యజమానిని కోల్పోవడంతో భార్య రోధనలు అందరికీ కలచివేశాయి. సీఐ లక్ష్మణరెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని తాడేపల్లిగూడెం ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

లారీ డ్రైవర్‌ మృతి

సీతానగరం, డిసెంబరు 12: మండలంలోని రఘుదేవపురం శివారున విద్యుత్‌ వైర్లు తగిలి బిక్కవోలుకు చెందిన సమరకుర్తి వాడపల్లి(31) మృతి చెందాడు. సోమవారం రఘుదేవపురం శివారున కూనవరం రోడ్డులో రైతుల ధాన్యం తోలేందుకు లారీలు వచ్చాయి. వాడపల్లి తన లారీని రోడ్డు పక్కన 11 కేవీ విద్యుత్‌ వైర్లు వెళ్లిన ప్రాంతంలో నిలిపాడు. ధాన్యం బస్తాలను లోడు చేస్తుండగా, లారీపై ఉన్న టార్పాలిన్‌ తీయడానికి వాడపల్లి లారీ ఎక్కి దానిని అందుకునే క్రమంలో విద్యుత్‌ వైర్లు చేతికి తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ కె.శుభశేఖర్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

Updated Date - 2022-12-13T01:13:39+05:30 IST