‘ఒక్క రైతుకు పంటల బీమా రాలేదు’

ABN , First Publish Date - 2022-07-05T07:18:08+05:30 IST

మా గ్రామంలో ఒక్క రైతుకు కూడా పంటల బీమా సొమ్ము రాలేదని నరేంద్రపురం గ్రామ రైతులు సోమవారం ఏడీఏ ఎస్‌జేవీ మోహనరావుకు సమస్యను వివరించారు.

‘ఒక్క  రైతుకు పంటల బీమా రాలేదు’

పి.గన్నవరం, జూలై 4: మా గ్రామంలో ఒక్క రైతుకు కూడా పంటల బీమా సొమ్ము రాలేదని నరేంద్రపురం గ్రామ  రైతులు సోమవారం ఏడీఏ ఎస్‌జేవీ మోహనరావుకు  సమస్యను వివరించారు.   దీనిపై ఏడీఏ మోహనరావు మాట్లాడుతూ  మండలంలో నాలుగు గ్రామాల్లో ఒక్క రైతుకు కూడా పంటలబీమా రాలేదని, సంబంధిత నివేదికను ఉన్నతాధికారులకు పంపించామన్నారు. ఏడీఏను కలిసిన వారిలో కేదిశి చిన్న, నేతల శ్రీనివాసరరావు, అయ్యాగారి రవి, గుత్తుల రెడ్డి, ఎం.శ్రీను, బి.సత్యనారాయణ, ఎన్‌.నాగారాజు ఉన్నారు.Read more