ప్రపంచ వినియోగదారుల దినోత్సవం

ABN , First Publish Date - 2022-03-16T05:42:04+05:30 IST

వినియోగదారు లంతా చైనత్యవంతులు కావాలని రాజమహేంద్రవరం దిశ స్టేషన్‌ డీఎస్పీ తిరుమలరావు సూచించారు.

ప్రపంచ వినియోగదారుల దినోత్సవం

రాజమహేంద్రవరం సిటీ, మార్చి 15: వినియోగదారులంతా చైత్వంతులు కావాలని రాజమహేంద్రవరం దిశ స్టేషన్‌ డీఎస్పీ తిరుమలరావు సూచించారు. ప్రపంచ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా మంగళవారం విని యోగదారుల హక్కుల అవగాహన సంఘం రూపొందిం చిన కరపత్రాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరికీ వినియోగదారుల చట్టా లపై అవగాహన ఉండాలన్నారు. కొన్న ప్రతీ వస్తువుకు రసీదు పొందాలని, ఏదైనా నష్టం జరిగితే రసీదు ద్వారా పరిహారం పొందవచ్చన్నారు. కార్యక్రమంలో సంఘం అధ్య క్షుడు డిఎస్‌ రాజేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ధర్నాలకోట వెంకటేశ్వరరావు, సహకార్యదర్శులు వట్టూరి ఈశ్వరప్ర సాద్‌, సుతాపల్లి శ్యామలరావు, సంఘం నాయకులు గెడ్డం కిషోర్‌కుమార్‌ మొగ్గ శ్రీను, వసంతరాయుడు, నరసింహ రాజు, నాగసాయి తదితరులు పాల్గొన్నారు.

Read more