అర్జీలు పూర్తిస్థాయిలో పరిష్కరించాలి

ABN , First Publish Date - 2022-01-04T05:28:04+05:30 IST

గిరిజనుల నుంచి అందిన అర్జీలకు పూర్తి స్థాయిలో పరిష్కారం చూపాలని ఐటీడీఏ పీవో ప్రవీణ్‌ ఆదిత్య ఆదేశించారు. ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం ఆయన సబ్‌కలెక్టరు కట్టా సింహాచలం, డీఎఫ్‌వో నిషాకుమారి, డీడీ ఎం.ముక్కంటితో కలిసి 70అర్జీలను స్వీకరించారు.

అర్జీలు పూర్తిస్థాయిలో పరిష్కరించాలి

 రంపచోడవరం, జనవరి 3: గిరిజనుల నుంచి అందిన అర్జీలకు పూర్తి స్థాయిలో పరిష్కారం చూపాలని ఐటీడీఏ పీవో ప్రవీణ్‌ ఆదిత్య ఆదేశించారు. ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం ఆయన సబ్‌కలెక్టరు కట్టా సింహాచలం, డీఎఫ్‌వో నిషాకుమారి, డీడీ ఎం.ముక్కంటితో కలిసి 70అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ కొన్ని దరఖాస్తులను ఇక్కడే పరి ష్కరించి మరికొన్నింటిని ఆయా శాఖలకు నివేదించి విచారణ తర్వాత పరిష్కరించనున్నట్లు తెలిపారు. రోడ్లు ఏర్పాటు చేయాలని, సాగు భూములకు పట్టాలివ్వాలని కోరుతూ అధికంగా అర్జీలు అందాయన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్లు లక్ష్మికళ్యాణి, ఆర్‌.వెంకటేశ్వర్లు, శ్రీనివాసరావు, శ్రీమన్నారాయణ, సుబ్రహ్మణ్యం, వీర్రాజు, సీహెచ్‌ శ్రీనివాసరావు, ఈఈ డేవిడ్‌రాజు, డీఈ గౌతమి, డీటీలు వెంకటేశ్వరరావు, సుధాకర్‌, ఎం.సత్యనారాయణ పాల్గొన్నారు.

Updated Date - 2022-01-04T05:28:04+05:30 IST