1,58,203 మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ

ABN , First Publish Date - 2022-12-13T00:42:11+05:30 IST

జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌లో నూరు శాతం ధాన్యం సేకరణపై అధికారులు దృష్టి సారించాలని కలెక్టర్‌ మాధవీలత ఆదేశించారు.

1,58,203 మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ

బొమ్మూరు, డిసెంబర్‌ 12: జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌లో నూరు శాతం ధాన్యం సేకరణపై అధికారులు దృష్టి సారించాలని కలెక్టర్‌ మాధవీలత ఆదేశించారు. బొమ్మూరు కలెక్టరేట్‌లో సోమవారం సాయంత్రం ధాన్యం కొనుగోలు తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 1,58,203 మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ చేశామన్నారు. వాతావరణం మార్పుల నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. చాగల్లులో 64 శాతం, అనపర్తి 61, కడియం 59 శాతం ఽసేకరణ చేశామన్నారు. కోరుకొండలో 10 శాతం, సీతానగరం 11, రాజమహేంద్రవరం రూరల్‌ మండలాల్లో 16 శాతం మాత్రమే తక్కువ ధాన్యం సేకరణ జరిగిందని కలెక్టర్‌ తెలిపారు. హౌసింగ్‌ కు సంబంధించి 55,061 ఇళ్ల నిర్మాణాలలో 13,084 పూర్తి చేశామన్నారు. గతవారం 1518 ఇళ్లు, ఈ వారం 766 ఇళ్లు పూర్తి చేశారని కలెక్టర్‌ తెలిపారు. పౌర సేవల్లో 512 సచివాలయాల్లో 20,114 సేవలు అందించామని తెలిపారు. వలంటీర్ల హాజరు శాతంపై ప్రత్యేక పర్యవేక్షణ అవసరం అన్నారు. ఆయుష్మాన్‌ భారత్‌ ఈకేవైసీలో జిల్లాలో 26,7155 కుటుంబాల్లో 75,5271 మందికిగాను 2,18,834 డేటా పూర్తి చేశామన్నారు. ఓటరు జాబితాలో భాగంగా మార్పులు, సవరణ ప్రక్రియలో భాగంగా 2023 షెడ్యూల్‌ ప్రకారం క్లెయిమ్‌లకు డిసెంబర్‌ 26 చివరి తేదీ అన్నారు. 2023 తుది జాబితా కోసం అధికారులు ఎటువంటి తప్పిదాలు లేకుండా చర్యలు తీసుకోవాలని మాధవీలత సూచించారు

Updated Date - 2022-12-13T00:42:11+05:30 IST

Read more