వివిధ దశల్లో 47,963 మంది ఇళ్ల నిర్మాణాలు

ABN , First Publish Date - 2022-11-25T00:51:00+05:30 IST

జిల్లాలో పౌరసేవలు, ఇళ్ళ నిర్మాణం, ఇంటి రుణాలు, నాడు-నేడులో చేపట్టాల్సిన పనులపై నిరంతరం దిశానిర్దేశం చేస్తున్నట్టు కలెక్టర్‌ డా. కె.మాధవీలత తెలిపారు.

వివిధ దశల్లో 47,963 మంది ఇళ్ల నిర్మాణాలు
వీడియోకాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌, జేసీ

రాజమహేంద్రవరం,నవంబరు 24 (ఆంధ్రజ్యో తి): జిల్లాలో పౌరసేవలు, ఇళ్ళ నిర్మాణం, ఇంటి రుణాలు, నాడు-నేడులో చేపట్టాల్సిన పనులపై నిరంతరం దిశానిర్దేశం చేస్తున్నట్టు కలెక్టర్‌ డా. కె.మాధవీలత తెలిపారు. అమరావతి నుంచి గురువారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించా రు. జిల్లాలో 47,936 మంది లబ్ధిదారుల ఇళ్ళ నిర్మా ణం వివిధ దశల్లో ఉందన్నారు. ఇందులో 24,459 మందికి అదనపు బ్యాంకు రుణాలు ఇప్పించామన్నారు. మిగిలిన ఇళ్ళ నిర్మాణంపై ప్రత్యేకదృష్టి పెట్టినట్లు తెలిపారు. జిల్లాలోని 512 సచివాలయాల ద్వారా పౌరసేవలందిస్తున్నామని ఈ వారంలో 27,393 సేవలందించినట్టు తెలిపారు. జిల్లాలో 8 అంశాలతో 6,49,315 ఇళ్ళ సర్వేలో భాగంగా 5,63,229 ఇళ్ళ నుంచి డేటా సేకరించామన్నారు.

15 రోజుల్లో భూహక్కు పత్రాలు : కలెక్టర్‌

బొమ్మూరు, నవంబరు 24 : జిల్లాలో వైఎస్సాఆర్‌ జగనన్న శా శ్వత భూ హక్కు భూ రక్ష హక్కు పత్రాల జారీ పనులు వేగ వంతం చేయాలని కలెక్టర్‌ కె.మాధవీలత ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో సీపీఎల్‌ఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్సి జి.సాయిప్రసాద్‌ గురువారం అమరావతి నుంచి జగనన్న శాశ్వత భూ హక్కు పథకం రీసర్వేపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.రీసర్వే, చుక్కల భూములు, కోర్టు కేసులో పురోగతి తదితర అంశాలపై సమీక్షిం చారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 272 గ్రామాల్లో 44 గ్రామాలు పూర్తయ్యాయని 15 రోజుల్లో భూహక్కు పత్రాలను పంపిణీ చేయ డానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

సమిత్వ పనులు సక్రమంగా చేయాలి

బొమ్మూరు, నవంబరు 24: సమిత్వ (గ్రామకంఠం)కు రీసర్వే పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తిచేయాలని.. పంచాయతీ విద్యుత్‌ బిల్లులను 24 గంటల్లో ఆన్‌లైన్‌లో పెట్టాలని కలెక్టర్‌ కె.మాధవీలత అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ కోన శశిధర్‌ గురువారం అభివృద్ధి పనులు, పథకాలపై వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పంచాయతీల కరెంట్‌ బకా యిలను 15వ ఆర్ధిక సంఘం నిధుల నుంచి విడుదల చేసి సత్వ రమే విద్యుత్‌ శాఖకు చెల్లించాలన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ 300 పంచాయతీలకు 261 పంచాయతీల్లో ఎస్‌డబ్ల్యూపీసీ కేంద్రాలు నిర్మించామన్నారు.అనంతరం సంబంధిత శాఖలతో కలెక్టర్‌ మాట్లా డుతూ సంపూర్ణ పారిశుధ్యం దిశగా పంచాయతీ తీర్మానాలను ఆర్‌డబ్ల్యూఎస్‌ 24 గంటల్లో అప్‌లోడ్‌ చేయాలన్నారు. సమీక్షలో డీఆర్వో నరసింహులు, డీపీవో జగదాంబ, పంచాయతీ శాఖ ఎస్‌ఈ వరప్రసాద్‌, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-25T00:51:02+05:30 IST