సీఎం పర్యటన రూట్‌మ్యాప్‌ పరిశీలించిన కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-12-30T01:07:11+05:30 IST

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి వచ్చేనెల 3న రాజమహేంద్రవరం వస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత గురువారం రూట్‌మ్యాప్‌ పరిశీలించారు.

 సీఎం పర్యటన రూట్‌మ్యాప్‌ పరిశీలించిన కలెక్టర్‌
సీఎం రూట్‌ మ్యాప్‌ పరిశీలించి, అధికార్లకు సూచనలు చేస్తున్న జిల్లా కలెక్టర్‌ కె.మాధవీలత

ఆర్ట్స్‌ కాలేజీ గ్రౌండ్‌లో సభకు ఏర్పాట్లు

రాజమహేంద్రవరం, డిసెంబరు 29 (ఆంరఽధజ్యోతి): ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి వచ్చేనెల 3న రాజమహేంద్రవరం వస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత గురువారం రూట్‌మ్యాప్‌ పరిశీలించారు. అంతకుముందు కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో జేసీ ఎన్‌.తేజ్‌భరత్‌, మున్సిపల్‌ కమిషనర్‌ కె.దినేష్‌కుమార్‌తో కలసి సమీక్షించారు. అనంతరం మున్సిపల్‌ స్టేడియం, మినీబైపాస్‌ రోడ్డు, ఎస్‌కేవీటీ కాలేజీ గ్రౌండ్‌, ఆర్ట్స్‌ కాలేజీ గ్రౌండ్‌, వీఎల్‌పురం లారీ స్టాండ్‌ తదితర ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్టేడియంలో హెలికాఫ్టర్‌ ల్యాండింగ్‌ కోసం ఇక్కడ ఏర్పాట్లను సంబంధిత అధి కారులు పరిశీలించారన్నారు. సీఎం ఆరోజు స్టేడియంలో హెలికాఫ్టర్‌ దిగి, రోడ్డు మార్గంలో ఆర్ట్స్‌కాలేజీలో ఏర్పాటుచేసిన సభకు వస్తారని చెప్పారు. జిల్లాల నుంచి వాహనాల కోసం, ప్రముఖుల వాహనాల కోసం పార్కింగ్‌ స్థలాలు గుర్తించినట్టు ఆమె తెలిపా రు. నగరంలో ట్రాఫిక్‌ సమస్య లేకుండా ప్రత్యామ్నాయ మార్గాల కోసం పోలీసు అధికార్లతో కలసి పరిశీలించినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో ఎ.చైత్రవర్షిణి, మున్సిపల్‌ ఎస్‌ఈ పాండు రంగారావు,సెంట్రల్‌ జోన్‌ డీఎస్పీ జేవీ సంతోష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-30T01:07:11+05:30 IST

Read more