జగన్‌ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత

ABN , First Publish Date - 2022-11-30T01:14:07+05:30 IST

జగన్‌ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని టీడీపీ అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి అయితాబత్తుల ఆనందరావు పేర్కొన్నారు.

జగన్‌ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత

అమలాపురం టౌన్‌, నవంబరు 29: జగన్‌ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని టీడీపీ అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి అయితాబత్తుల ఆనందరావు పేర్కొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా పాలన సాగించే చంద్రబాబు పాలన కోసం ప్రజలు ఎదు రుచూస్తున్నారని వివరించారు. అమలాపురంలో మంగళవారం టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబుతో కలిసి ‘ఇదేం ఖర్మ మన రాష్ర్టానికి’ పోస్టర్లను ఆవిష్కరించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లాడ సోంబాబు, తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు పెచ్చెట్టి విజయ లక్ష్మి, నాయకులు ప్రధాన దెందుకూరి సత్తిబాబురాజు, కడలి వెంకటేశ్వర రావు, మట్టా మహలక్ష్మిప్రభాకర్‌, మల్లుల పోలయ్య, యెరుబండి వెంకటే శ్వరరావు, నడింపల్లి ఉదయబాబు, గొలకోటి చిన్నా, ఆవుపాటి గోపాల్‌, పట్నాల రమణ, నామాడి తారక్‌, గంధం శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-30T01:14:07+05:30 IST

Read more