ముగిసిన రాష్ట్రస్థాయి టెన్నికాయిట్‌ పోటీలు

ABN , First Publish Date - 2022-07-18T07:20:33+05:30 IST

మండపేటలో డిగ్రీ కళాశాలలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి టెన్నికాయిట్‌ పోటీలు ఆదివారంతో ముగిశాయి. 11జిల్లాలకు చెందిన 120మంది క్రీడా కారులు పాల్గొన్నారు.

ముగిసిన రాష్ట్రస్థాయి టెన్నికాయిట్‌ పోటీలు

మండపేట, జూలై 17: మండపేటలో డిగ్రీ కళాశాలలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి టెన్నికాయిట్‌ పోటీలు ఆదివారంతో ముగిశాయి. 11జిల్లాలకు చెందిన 120మంది క్రీడా కారులు పాల్గొన్నారు. ఆదివారం జరిగిన ముగింపు కార్యక్ర మంలో విజేతలకు మండపే ట మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ చుండ్రు శ్రీవరప్రకా ష్‌ బహుమతులు అందజేశారు. ఆరుగురు క్రీడాకారులు కేరళలో ఆగస్టు 13,14,15 తేదీల్లో జరిగే దక్షణాది రాష్ట్రాల క్రీడా పోటీల్లో పాల్గొంటారని  టెన్నికాయిట్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కార్యదర్శి రమేష్‌ తెలిపారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి వినయ్‌కుమార్‌, పి.జె.డి.రామా రావు, నవీన్‌ బాబులు జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారని రమేష్‌ చెప్పారు. విజ యనగరానికి చెందిన సీహెచ్‌.తారకేశ్వరరావు, విశాఖకు చెందిన ఎం.నవీన్‌, మహిళా విభాగంలో విజయనగరం జిల్లా నుంచి ఆర్‌.మౌనిక, ఎం.ప్రవల్లిక, పి.రేణుక, జి.శ్రావణిలు ఎంపికయ్యారన్నారు. విశాఖకు చెందిన క్రీడాకారులు పల్లవి, నాగలక్ష్మిలు జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డి రాధాకృష్ణ, కపిలేశ్వరపురం జడ్పీ హైస్కుల్‌ హెచ్‌ఎం మంగర వెంకట్రాజు, మారేడుబాక సర్పంచ్‌ ఎం.గోవిందరాజు, డిగ్రీ కాలేజి ప్రిన్సిపాల్‌, శ్రీనివాసరావు, పీడీలు, నిర్వాహకులు క్రిడాకారులు పాల్గొన్నారు. Read more