‘జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక బాదుడే బాదుడు’

ABN , First Publish Date - 2022-04-10T06:04:46+05:30 IST

రాష్ట్రంలో జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక బాదుడే బాదుడు పథకం నడుస్తుందని మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు విమర్శించారు.

‘జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక బాదుడే బాదుడు’

గోపాలపురం, ఏప్రిల్‌ 9: రాష్ట్రంలో జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక బాదుడే బాదుడు పథకం నడుస్తుందని మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు విమర్శించారు. మండలంలోని కరగపాడు, బుచ్చయ్యపాలెంలో టీడీపీ గౌరవ సభలు శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మోకాళ్లపై కూర్చుని లాం తర్లు, కొవ్వొత్తుల సాయంతో నిరసన వ్యక్తంచేశారు. కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి పెరిగిన నిత్యవసరాలు, కరెంటు కోతలు, విద్యుత్‌చార్జీలు, పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌ ధరల పెంపుతో ప్రభుత్వం ప్రజలపై ఎంత ఆర్థిక భారం పెట్టిందో వివరించారు. దీంతో పాటు ప్రతీ ఇంటికి కొవ్వొత్తులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పార్టీ మండలా ధ్యక్షుడు సత్యనారాయణ, కరగపాడు ఎంపీటీసీ జక్కు సూర్యచంద్రం, పాల్గొన్నారు. 

Read more