నిర్వహణ లేక.. నీరు పారక

ABN , First Publish Date - 2022-09-08T06:29:23+05:30 IST

25 వేల ఎకరాల ఆయకట్టు సమస్య..

నిర్వహణ లేక.. నీరు పారక
అధ్వానంగా ఉన్న చాగల్నాడు ఎత్తిపోతల కాలువ

పూడుకుపోతున్న చాగల్నాడు ఎత్తిపోతల కాలువ

నిరుపయోగంగా మారిన పథకం

నీటి ప్రవాహనికి అడ్డంకులు

చిట్టడవిలా మారిన గట్లు

ఆక్రమణలకు గురవుతున్న వైనం

మూడేళ్లగా ఆధునికీకరణకు దూరం

25 వేల ఎకరాలకు అందని సాగునీరు

అన్నదాతల ఆందోళన

జిల్లా కేంద్రంలో ఉన్నా పట్టని వైనం

కన్నెత్తి చూడని అధికారులు


25 వేల ఎకరాల ఆయకట్టు సమస్య.. జిల్లా కేంద్రానికి అతి చేరువగా.. అనపర్తి నియోజకవర్గం పరిధిలో ఉంది. అయినా నేటికీ సమస్యగానే ఉంది.. ఎందుకంటే పాలకులు పట్టించుకోరు..  అధికారులు కన్నెత్తి చూడరు.. ప్రతి ఏడాది ఆధునికీకరణ చేశామంటారు.. తీరా చూస్తే ఎవరైనా సరే ఎక్కడ చేశారు అనక మానరు..  ఇదీ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న చాగల్నాడు కాలువ దుస్థితి. అధికారుల నిర్లక్ష్యం..  పాలకుల అలక్ష్యం కారణంగా లక్ష్యం నీరుగారిపోతోంది. ఉన్నతాధికారులు కాలువపై దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు. 


రాజానగరం, సెప్టెంబరు 7 : లక్ష్యం నీరు గారిపోతోంది. అయినా అధికారులు చేపట్టే చర్యలు శూన్యం.. ఏకంగా 25 వేల ఎకరాలకు సాగునీరందించే కాలువను పట్టించుకునే వారే కరువయ్యారు. వానాకాలంలోనూ సాగునీరందక రైతు లు ఇబ్బందులు పడుతున్నారు. అయినా అధి కారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. రెండు నియోజకవర్గాల్లో సాగు, తాగునీరందించే కాలువ పూడుకుపోతున్నా కనీసం కన్నెత్తి చూసే వారే కరువయ్యారు. 


అధికారుల నిర్లక్ష్యం..


అధికారుల నిర్లక్ష్యంతో మెట్ట ప్రాంతంలో ఉన్న చాగ ల్నాడు కాలువ రూపురేఖలు మారుతోంది. రాజమహేంద్ర వరం రూరల్‌ కాతేరు వద్ద గోదావరి నుంచి నీటిని పం పింగ్‌ చేసి కాలువకు విడుదల చేస్తారు.తరువాత కోల మూరు, రాజానగరం మండలం పాలచర్ల వద్ద రెండు లిఫ్ట్‌ ల ద్వారా 50 కిలోమీటర్లు సాగు,తాగునీటిని విడుదల చేస్తా రు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న కాలువను నిధుల లేమి కారణంగా అధికారులు పట్టించుకోవడం మానేశారు.  కాలు వలో దట్టంగా పెరిగిన గడ్డి దుబ్బులు నీటి ప్రవాహనికి అడ్డంకిగా మారాయి. దీంతో ఆయకట్టుకు సాగునీరందక అన్నదాతలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలువలో పూడికతీత పనులు చేపట్టకపోవడంతో చిట్టడవిలా తయా రైంది. ప్రతి ఏడాది ఆయకట్టు పరిధిలో రైతులు వరి నారుమడులు సిద్ధం చేసుకునేందుకు గోదావరి జలాలను విడుదల చేసే వారు.ఈ ఏడాది ఖరీఫ్‌ ఆరంభమై మూడు నెలలు ముగి సినా నేటికి కూడా కాలువ ద్వారా నీటిని విడు దల చేయ లేదు. దీనిపై అన్నదాతలు ప్రశ్నించినా కనీసం సమాధానం చెప్పేవారే కరువయ్యారు. 


కాలువ వెంబడి ఆక్రమణలు..


మెట్ట ప్రాంతమైన రాజానగరం పరిసర ప్రాంతాల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం జోరుగా సాగడంతో వ్యాపారులు చాగల్నాడు కాలువ గట్టును వదిలిపెట్టలేదు. కాలువకు ఇరువైపులా ఉన్న గట్లును రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు తమ వ్యాపార కార్యకలాపాలకు అనువుగా ఆక్రమించుకుని వ్యాపారాలు చేస్తున్నారు. అంతే కాకుండా పాలచర్ల మొద లుకుని రంగంపేట వరకు కాలువ గట్టుకు ఇరువైపులా పలు రకాలైన పరిశ్రమల వెలిశాయి. దీంతో కాలువ సహజ రూపాన్ని కోల్పోయి కుచించుకుపోతోంది. కాలువ గట్లుపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కాలువ తవ్విన సమ యంలో గట్లు పటిష్టతకు వేసిన మట్టిని సైతం  తరలిం చుకుపోయారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.  దీంతో కాలువ గట్లు బలహీనంగా మారి కొన్ని చోట్లు గండ్లు పడిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం గోదావరి నీరు విడుదల చేసినా గట్లు ఆగుతాయా లేదా అనేది అనుమానమే. 


 నిర్వహణ లేక.. నీరు పారక...


చాగల్నాడు కాలువ నిర్వహణ లేక తూటి కాడలు, తుప్ప లతో నిండిపోయింది. మూడేళ్ల కిందట టీడీపీ ప్రభుత్వ హ యాంలో సుమారు రూ.30 లక్షలతో కాలువ ఆధునికీకరణ పనులు చేపట్టారు. ఆ తరువాత మూడేళ్లగా ఆ కాలువను పట్టించుకోవడమే మానేశారు. ప్రధాన కాలువనే పట్టించు కోకపోతే ఇంక పిల్ల కాలువల పరిస్థితి ఏవిఽధంగా ఉం టుందో అర్ధం చేసుకోవచ్చని అన్నదాతలు ఆవేదన చెందు తున్నారు.కాలువ కొన్ని చోట్ల ప్రస్తుతం మురుగునీటి కాలు వగా దర్శనమిస్తోంది.కాలువ ప్రక్షాళనకు దశాబ్దాలుగా  రైతులు ఎదురుచూస్తున్నా ఫలితం లేకుండా పోతోంది.  


  పూడికతీత పేరుతో దోపిడీ.. 


చాగల్నాడు కాలువ పూడికతీత పనుల పేరుతో సంబం ఽధిత అఽఽధికారులు ప్రతి ఏడాది లక్షలాది రూపాయలు దోచుకుంటున్నారని కొంతమంది ఆయకట్టు రైతులు ఆరోపిస్తున్నారు. వేసవిలో పూడితతీత పనులు చేపట్టాల్సి ఉండగా వర్షాలు పడేనాటికి కాలువ నీరు విడుదల చేసే సమయంలో కాలువలో పూడికతీత పనులు మొక్కుబడిగా చేసి జేబులు నింపుకుంటున్నారు. కాలువకు ఇప్పటి వరకూ పూర్తిస్థాయిలో మరమ్మతులు చేసిన దాఖలాలు లేవు. గట్లు వెంబడి జోరుగా సాగుతున్న ఆక్రమణలతో కాలువ కూడా కుచించుకుపోయింది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కాలువ పరిరక్షణకు చర్యలు చేపట్టాల్సి ఉంది. 


Read more