-
-
Home » Andhra Pradesh » East Godavari » cbi enquire to explan-NGTS-AndhraPradesh
-
సీబీఐ చార్జిషీట్‌పై స్పందించాలి: గొల్లపల్లి
ABN , First Publish Date - 2022-02-23T06:26:02+05:30 IST
మాజీ ఎంపీ వైఎస్ వివేకానం దరెడ్డి హత్యా కేసులో సీబీఐ బయట పెడుతున్న అంశాలపై వైసీపీ నాయకులు ఏమంటారని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు ప్రశ్నించారు.

మలికిపురం, ఫిబ్రవరి 22: మాజీ ఎంపీ వైఎస్ వివేకానం దరెడ్డి హత్యా కేసులో సీబీఐ బయట పెడుతున్న అంశాలపై వైసీపీ నాయకులు ఏమంటారని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు ప్రశ్నించారు. మండలంలోని శంకరగుప్తంలో మంగళవారం జరిగిన టీడీపీ సమావేశంలో ఆయన మాటా ్లడారు. హత్య జరిగిన రోజున గుండెపోటని అందరినీ నమ్మిం చే ప్రయత్నంచేసి, సాక్ష్యాలను తారుమారు చేయడానికి ప్రయత్నించిన మాట వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నిం చారు. తల్లికి, చెల్లికి, చిన్నాన్నకు న్యాయం చేయలేని సీఎం జగన్ ప్రజలకు ఏంచేస్తారని అన్నారు. కార్యక్రమంలో కాకి లక్ష్మణ్, అడబాల సాయిబాబు, రాపాక ఆనంద్‌కుమార్, కంది కట్ల నిర్మల, సర్పంచ్ యెనుముల నాగు, ఆచంట మాణిక్యం, చాగంటి స్వామి, అడబాల యుగంఽధర్ పాల్గొన్నారు.