పేకాట శిబిరంపై దాడి

ABN , First Publish Date - 2022-09-08T06:32:53+05:30 IST

రాజమహేంద్రవరం కేంద్రంగా క్రికెట్‌, పేకాట జూదక్రీడలు విచ్చ లవిడిగా జరుగుతున్నాయని వారిని పట్టుకోవడంలో నిఘా వ్యవస్థ వైఫల్యం చెందుతుందని ఈ నెల 6న ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచు రితమైన కథనంపై జిల్లా పోలీస్‌ స్పెషల్‌ టీమ్‌ స్పందించింది.

పేకాట శిబిరంపై దాడి

9 మంది అరెస్టు.. విడుదల

ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్‌


రాజమహేంద్రవరం సిటీ, సెప్టెంబరు 7 : రాజమహేంద్రవరం కేంద్రంగా క్రికెట్‌, పేకాట జూదక్రీడలు విచ్చ లవిడిగా జరుగుతున్నాయని వారిని పట్టుకోవడంలో  నిఘా వ్యవస్థ వైఫల్యం చెందుతుందని ఈ నెల 6న ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచు రితమైన కథనంపై జిల్లా పోలీస్‌ స్పెషల్‌ టీమ్‌ స్పందించింది. మంగళవారం రాత్రి రాజమహేంద్రవరం శానిటోరియం వెనుక సంతోష్‌ నగర్‌కు వెళ్లే దారిలో ఒక ప్రైవేట్‌ దంత వైద్యశాలకు సంబంధించిన అపార్టుమెంట్‌ మెంట్‌ బ్లాక్‌లో ఒక గదిలో జూదం ఆడుతున్న వారిని చాకచక్యంగా పట్టుకున్నారు.9 మంది జూదగాళ్ళను స్పెషల్‌ టీమ్‌ అదుపులోకి తీసుకుని వారిని రాజానగరం పోలీసులకు అప్పగించారు. నిందితుల్లో పశుసంవర్ధక శాఖ లో పని చేస్తున్న ఒక ఉద్యోగి, టీచింగ్‌ వృతిలో ఉన్న మరొక ఉద్యోగి ఉన్నారు. ఈ ఇద్దరు రాజమహేంద్రవరం రూరల్‌ నియోజకవర్గానికి చెందిన వారే. వీరితో పాటు వ్యాపారాలు చేసుకునేవారు, వివిధ రంగాలకు చెందిన వారున్నారు. వీరి వద్ద నుంచి పోలీసులు రూ.88 వేలు  నగదు, 9 సెల్‌ ఫోన్లు స్వాధీ నం చేసుకున్నారు.అయితే ఈ జూదరులకు చెందిన ఒక వ్యక్తి అర్ధరాత్రి రాజానగరం స్టేషన్‌కు వచ్చి  ప్రజాప్రతినిధి తమ్ముడితో ఫోన్‌లో పోలీసులతో మాట్లాడించి విడిపించారు. అయితే పోలీసులు మాత్రం నిందితుల ఫోన్‌లు తీసుకుని బుధవారం ఉదయం స్టేషన్‌కు వచ్చి ఫోన్‌లు తీసుకువెళ్ళాలని చెప్పి పంపించారు. బుధవారం ఉదయం స్టేషన్‌ కు వెళ్లిన 9 మందికి పోలీసులు స్టేషన్‌ బెయిల్‌ మంజూరు చేయడంతో వారు విడుదలయ్యారు. ఇంత వరకు బాగానే ఉంది. అయితే క్రికెట్‌ బెట్టింగ్‌కు సంబంధించిన విచారణ చేయాల్సి ఉండగా ఆ దిశగా ఎలాంటి చర్యలు కనిపించలేదు. నిందితుల్లో కొంత మంది క్రికెట్‌ బెట్టింగ్‌లకు పాల్పడినట్లు అనుమానాలు ఉన్నాయి. ఆ దిశగా విచారణ జరపాల్సి ఉండగా వారిని వదిలిపెట్టడంపై పలు అను మానాలు వ్యక్తమవుతున్నాయి. 

Read more